ఆగస్టు వార్‌ నుండి మరో రెండు సినిమాలు కూడా ఔట్‌..!

కరోనా తర్వాత సినిమాల జాతక రంటిన్యూ అవుతోంది.టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద ఈమద్య కాలంలో విడుదల అయిన సినిమా లు భారీ గా వసూళ్లు రాబడుతున్నాయి.

 Tollywood Box-office War In August Month  Tollywood, August Month, Two Movies, G-TeluguStop.com

కనుక చాలా మంది హీరో లు మరియు నిర్మాతలు కూడా తమ సినిమా లు ఇప్పుడే విడుదల అవ్వాలని భావిస్తున్నారు.గత రెండు నెలలుగా వారం కు కనీసం నాలుగు అయిదు సినిమా లు వస్తున్నాయి.

పెద్ద సినిమా లు అయితే ఒకటి రెండు వస్తున్నాయి.మొత్తానికి ప్రతి వారం కూడా సినిమా ల జాతర మాత్రం కంటిన్యూ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు లో సినిమా ల జాతక కొనసాగబోతుంది.ఏకంగా వారంకు మూడు నాలుగు చొప్పున ఏకంగా పది హేను నుండి ఇరవై సినిమా ల వరకు ఆగస్టు లో విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

అందులో చిన్న సినిమా లు మీడియం రేంజ్ సినిమా లు మరియు భారీ చిత్రాలు కూడా ఉన్నాయి.వందల కోట్ల బడ్జెట్‌ సినిమా లు లేవు కాని చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్ వంటి సినిమా లు మాత్రం విడుదలకు సిద్దం అవుతున్నాయి.

కొన్ని పెద్ద సినిమా లు సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పటికే ఒకటి రెండు సినిమా లు ఆగస్టు లో తాము రావడం లేదు అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గాడ్‌ ఫాదర్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమా ల విడుదల విషయంలో కాస్త గందరగోళం నెలకొందట.

ఒక మీడియం రేంజ్ సినిమా ను ఆగస్టు నుండి సెప్టెంబర్‌ కు వాయిదా వేశారు.ఇదే సమయంలో మరో రెండు సినిమా లు కూడా వాయిదా విషయమై చర్చ జరుగుతోంది.

ఆ రెండు సినిమా ల్లో ఒకటి మీడియం రేంజ్ సినిమా కాగా మరోటి చిన్న సినిమా.ఈ రెండు సినిమా లు కూడా విడుదల తేదీ మారడం దాదాపుగా కన్ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో ఆగస్టు లో రాబోతున్న పెద్ద సినిమా ల సంఖ్య కూడా ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.రెండు సినిమా లు ఔట్ అయినా కూడా ఆగస్టు వార్ ఖచ్చితంగా రసవత్తరంగా ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube