వసూళ్ల వర్షంతో షేక్ అవుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్....  

Tollywood Box Office Is Shaking With Two Movies Collections-allu Arjun,darbar Movie Collections,mahesh Babu,rajinikanth,sarileru Nikevvaru Movie Collections,tollywood,tollywood Box Office,trivikram

సంక్రాంతి బరిలో దిగినటువంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవుతోంది.అంతేకాక మరోపక్క సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తెలుగు హీరోలకు గట్టిపోటీని ఇస్తున్నాడు.

Tollywood Box Office Is Shaking With Two Movies Collections-allu Arjun,darbar Movie Collections,mahesh Babu,rajinikanth,sarileru Nikevvaru Movie Collections,tollywood,tollywood Box Office,trivikram-Te-Tollywood Box Office Is Shaking With Two Movies Collections-Allu Arjun Darbar Movie Collections Mahesh Babu Rajinikanth Sarileru Nikevvaru Tollywood Trivikram

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన టువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.ఈ చిత్రం విడుదలైన రోజునే దాదాపుగా 47.77 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి మహేష్ బాబు ఔరా అనిపించాడు.

అయితే సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలయిన ఒక రోజు తర్వాత విడుదలైన టువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురములో చిత్రం కూడా థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.ఇప్పటికే ఇతర దేశాల్లో బాహుబలి రికార్డులను స్టైలిష్ స్టార్ తిరగరాశాడు.

దీంతో ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో తన సత్తాను చాటుకుంది.దాదాపుగా ఈ చిత్రం 85కోట్ల రూపాయల గ్రాస్ షేర్ ని వసూలు చేసినట్లు ఇప్పటికే అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు పోస్టర్ కూడా విడుదల చేశారు.

అయితే ఇది ఇలా ఉండగా మరోవైపు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్  ఏ.అర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించినటువంటి దర్బార్ చిత్రం మొదటగా సంక్రాంతి బరిలోకి దిగింది.

అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఈ అంచనాలకు తగ్గట్టుగానే రజనీకాంత్ తన సత్తా నిరూపించుకున్నాడు.విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపుగా 150 కోట్లు గ్రాస్ వసూలు చేసి తిరుగులేకుండా దూసుకుపోతున్నాడు.

అయితే ఇప్పటికే టాలీవుడ్ లో  మూడు భారీ చిత్రాలు విడుదలై తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి.ఇక ఈ నెల 15వ తారీఖున నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా.

! అనే చిత్రం విడుదల కాబోతోంది.దీంతో ప్రేక్షకులు కళ్యాణ్ రామ్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే బాక్స్ ఆఫీసు వద్ద ఈ హీరోల పోటీని తట్టుకొని కళ్యాణ్ రామ్ నిలబడతారో లేదో చూడాలి. 

.

తాజా వార్తలు