2022 ఏడాదికి టాప్ హిట్ ట్రిపుల్ ఆర్ కాదట.. డీజే టిల్లు అట.. ఎలా అంటే?

2022 లోకి ఎంటర్ అయ్యి అప్పుడే ఐదు నెలలు గడిచి పోతుంది.ఇప్పటి వరకు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.

 Tollywood Box Office Collection 2022, Box Office Collection, 2022 Box Office Collection, Dj Tillu, Rrr, Tollywood , Kgf2, Bheemla Nayak, Radhyashyam-TeluguStop.com

అయితే ఆ సినిమాల్లో ఇప్పటి వరకు బెస్ట్ సినిమా ఏది? అంటే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది ఆర్ఆర్ఆర్ సినిమా.అయితే ట్రిపుల్ ఆర్ సినిమా కాదట.

ఒక చిన్న సినిమా ఈ ఏడాది టాప్ సినిమా అంటూ నిపుణులు చెబుతున్నారు.

 Tollywood Box Office Collection 2022, Box Office Collection, 2022 Box Office Collection, DJ Tillu, RRR, Tollywood , Kgf2, Bheemla Nayak, Radhyashyam-2022 ఏడాదికి టాప్ హిట్ ట్రిపుల్ ఆర్ కాదట.. డీజే టిల్లు అట.. ఎలా అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమాలో ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ నటించారు.ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కింది.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.వీరిద్దరూ నటన పరంగా అదరగొట్టారు.

ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.ఈ సినిమా దాదాపు 1200 కోట్ల వరకు వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది.

ఈ ఏడాది స్టార్టింగ్ లోనే జనవరి 7న ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.అయితే చిన్న సినిమాగా వచ్చిన డీజే టిల్లు సూపర్ హిట్ కొట్టి కలెక్షన్ల మోత మోగించింది.

ఈ ఏడాది రిలీజ్ అయినా సినిమాల షేర్ వివరాలు పరిశీలిస్తే.

ట్రిపుల్ ఆర్ 609 కోట్లు, కేజిఎఫ్ 2 502 కోట్లు, భీమ్లా నాయక్ 97.63 కోట్లు, రాధేశ్యామ్ 83.20 కోట్లు, ఆచార్య 48.36 కోట్లు, బంగార్రాజు 39.15 కోట్లు, ఇటీవలే రిలీజ్ అయినా సర్కారు వారి పాట 80 కోట్ల షేర్ వసూళ్లు చేసింది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.అయితే ఈ పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన డీజే టిల్లు దడపా 30 కోట్ల గ్రాస్ 17 కోట్ల షేర్ తో ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.కేవలం 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది.

అయితే అందరు అనుకుంటున్న పెద్ద సినిమా ట్రిపుల్ ఆర్ మాత్రం 350 కోట్లకు పైగానే పెట్టుబడి పెడితే 600 కోట్ల షేర్ తెచ్చింది. దీంతో అతి పెద్ద విషయం డీజే టిల్లు అని టెర్డ్ పండితులు చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube