యుట్యూబ్ లో సూపర్ హిట్ అయిన డియర్ కామ్రేడ్ హిందీ మూవీ

క్రేజీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కెరియర్ లో గత ఏడాది వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.అయిన కూడా అతని ఇమేజ్ మాత్రం తగ్గలేదు.

 Dear Comrade Hindi Dubbing Version Got Record Views In Youtube, Tollywood, Bolly-TeluguStop.com

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు.పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ కెరియర్ లో గత ఏడాది వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా డిజాస్టర్ గా మారింది.రిలీజ్ కి ముందు ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక హిందీలో రీమేక్ చేయడానికి నిర్మాత కరణ్ జోహార్ రెడీ అయ్యారు.అయితే రిలీజ్ తర్వాత సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.

ఇక ఇందులో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన క్రికెటర్ గా కీలక పాత్రలో నటించింది.సినిమా ఫలితం చూసిన తర్వాత ఈ సినిమా రీమేక్ ఆలోచనని కరణ్ జోహార్ విరమించుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాని డబ్బింగ్ వెర్షన్ లో యుట్యూబ్ లో రిలీజ్ చేశారు.ఇక విజయ్ దేవరకొండకి బాలీవుడ్ లో ఉన్న క్రేజీ నేపధ్యంలో యుట్యూబ్ లో ఈ సినిమాకి ఏకంగా వంద మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఇప్పటి వరకు ఈ స్థాయిలో కేవలం అల్లు అర్జున్ సినిమాలకి మాత్రమే హిందీ డబ్బింగ్ వెర్షన్ లో వ్యూస్ వచ్చేవి.మొదటి సారి విజయ్ దేవరకొండ సినిమాకి కూడా ఆ స్థాయిలో వ్యూస్ రావడంతో ఏకంగా 1.3 మిలియన్ లైకులతో అత్యధిక లైకులను రాబట్టిన హిందీ డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube