టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీల దగ్గర ఉన్న కాస్ట్లీ కార్లు ఇవే?

టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో ఖరీదైన కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో మూడు కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి ఖరీదైన లంబోర్ఘిని కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

 Tollywood Bollywood Star Heroes And Their Cars Details Latest, Bollywood Heroes,-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ కు మాత్రమే కాదు కార్లంటే అమితాభిమానం చూపించే టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఖరీదైన కార్లను ఎంతో ఇష్టపడతారు.

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ప్రపంచంలోని వేగవంతమైన కార్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న బుగాటి వెరావ్ కారును వినియోగిస్తున్నారని సమాచారం.షారుఖ్ ఖాన్ దగ్గర ఉన్న కారు గంటకు ఏకంగా 400 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని సమాచారం.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ దగ్గర మెర్సిడెజ్ బెంజ్ 600 కారు ఉంది.ఈ కారు బాంబ్ ప్రూఫ్ కారు కావడం గమనార్హం.

గతంలో అమీర్ ఖాన్ ఒక షోను హోస్ట్ చేస్తున్న సమయంలో ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

Telugu Ajay Devgan, Ameer Khan, Bomb Proof Car, Buggati Vareyon, Cars, Hruthik R

అ సమయంలో అమీర్ ఖాన్బాంబ్ ప్రూఫ్ కారును కొనుగోలు చేయడం జరిగింది.మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ దగ్గర రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఘోస్ట్ సిరీస్ ii కారు ఉంది.ఈ కారు విలువ ఏకంగా 7 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

Telugu Ajay Devgan, Ameer Khan, Bomb Proof Car, Buggati Vareyon, Cars, Hruthik R

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రస్తుతం రాయిస్ కల్లినస్ అనే కారును వినియోగిస్తుండగా ఈ కారు ధర కూడా 7 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం.టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మరి కొందరు హీరోల దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube