గాడిదతో గేమ్స్ ఆడుతున్న హాలీవుడ్ సూపర్ స్టార్  

Tollywood Bollywood Lock Down Covid 19hollywood Superstar - Telugu Bollywood, Covid-19, Hollywood Superstar Chess Game With Donkey In Home Quarantine, Lock Down, Tollywood

కరోనా

కారణంగా స్వీయ నిర్బంధంలో ఉన్న

సెలబ్రిటీలు

ఎవరి స్టైల్ లో వారు సోషల్ మీడియాలో అందరికి ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఫ్యాన్స్ తో స్వీయ నిర్బంధంలో వారి స్వీయ అనుభవాలు పంచుకుంటున్నారు.

 Tollywood Bollywood Lock Down Covid 19hollywood Superstar

ఇప్పుడు అమెరికాలో ఉంటున్న

హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్

గురించి చెప్పుకోవాలి.ఎప్పుడు భిన్నంగా ఆలోచించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టె ఇతను ఇప్పుడు ఆసక్తికరమైన ఫోటోని షేర్ చేశారు.

ఇక ఇతని పెట్టిన పోస్ట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సినిమాలలో యాక్షన్ తో పాటు కామెడీ పండించే ఆర్నాల్డ్ తన హాస్య చతురతని ఇలా పోస్టులలో కూడా చూపించాడు.

గాడిదతో గేమ్స్ ఆడుతున్న హాలీవుడ్ సూపర్ స్టార్-General-Telugu-Telugu Tollywood Photo Image

పెంపుడు జంతువులు

అంటే ఎవరికైనా ఈ పిల్లో, కుక్కో ఉంటాయి.అయితే ఆర్నాల్డ్ మాత్రం గుర్రాన్ని గాడిదను పెంచుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇక హోం క్వారంటైన్ ఉన్న సూపర్ స్టార్ తన పెంపుడు జంతువులతోనే కాలక్షేపం చేస్తున్నారు.తాజాగా

గాడిద

తో చెస్ ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో ఆర్నాల్డ్ పోస్ట్ చేశారు.

గాడిదతో చెస్ ఆడడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నానని కుటుంబంతో కలిసి చెస్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కొంత సమయం వెచ్చించాలంటూ ట్వీట్ చేశాడు.పెంపుడు జంతువులని కూడా కుటుంబ సభ్యులుగా

ఆర్నాల్డ్

పరిచయం చేయడం కాస్తా ఆసక్తికరంగానే అనిపించినా గాడిదతో గేమ్స్ ఆడటం మాత్రం కొత్తగా ఉంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hollywood Superstar Chess Game With Donkey In Home Quarantine Related Telugu News,Photos/Pics,Images..