ఒకప్పటి క్లాస్ మెట్స్.. ఇప్పుడు స్టార్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసా..?!- Tollywood Bollywood Classmates Heros Celebrates

Tollywood, Bollywood, classmates, heros, celebrates,tollywood news - Telugu Bollywood, Celebrates, Classmates, Heros, Tollywood

చిన్నప్పుడు ఒకే పాఠశాలలో ఒకే బెంచీలో కూర్చున్న వ్యక్తులు పెద్దయ్యాక ఎవరు ఏమవుతారో అన్న విషయం ఎవరికి తెలియదు.ఒక్కొక్కరు వారికి నచ్చిన విధంగా ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని ఆ రంగం వైపు అడుగులు వేస్తూ విజయం సాధిస్తూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం.

 Tollywood Bollywood Classmates Heros Celebrates-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళితే.చిన్నప్పుడే ఒకే పాఠశాలలో ఒకటో తరగతిలో చదువుకున్న కొందరు వ్యక్తులు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్న వారు ఉన్నారు.

అంటే ఒకప్పుడు వారిద్దరూ క్లాస్మేట్స్..

 Tollywood Bollywood Classmates Heros Celebrates-ఒకప్పటి క్లాస్ మెట్స్.. ఇప్పుడు స్టార్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు వారిద్దరూ సెలబ్రిటీలు అన్నమాట.ఇంతకీ వారెవరో మనం తెలుసుకుందామా.

ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన వారు దగ్గుబాటి వారసుడు రానా, అలాగే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ. వీరిద్దరూ చిన్నతనంలో ఒకే పాఠశాలలో చదువుకున్నారని ఇదివరకు తెలియజేసే సంగతి అందరికి విదితమే.ఇక వీరిద్దరూ వారి స్థాయికి తగ్గట్టు టాప్ హీరోలుగా ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక వీరిద్దరి తర్వాత ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న మాచిరాజు ప్రదీప్, అలాగే టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన నాచురల్ స్టార్ నాని కూడా ఇదివరకు హైదరాబాదులోని ఓ పాఠశాలలో చదువుకున్నారని ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.

ఇలా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలైన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు కూడా చిన్నప్పుడు వారిద్దరూ ఒకే తరగతి గదిలో చదువుకున్నారు.ప్రస్తుతం వీళ్లిద్దరు సినిమా ఇండస్ట్రీలో తమ రేంజ్ ఏంటో సినిమా సినిమాకి నిరూపించుకుంటున్నారు.

వీరితోపాటు ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ భార్యలైన హీరోయిన్ అనుష్క శర్మ, సాక్షి ధోని లు కూడా చిన్నప్పుడు ఒకటే పాఠశాలలో కలిసి చదువుకున్నారు.ప్రస్తుతం వ్యాపార రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఆనంద్ మహేంద్ర ముఖేష్ అంబానీ లు కూడా వారి విద్యాభ్యాస కాలంలో ఒకటే పాఠశాలలో ఒకే తరగతిలో చదువుకున్నారు.

#Heros #Celebrates #Classmates

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు