గత పదేళ్లలో.. టాలీవుడ్ లో వచ్చిన మల్టీస్టారర్ లిస్ట్ ఇదే?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.కానీ ఎందుకో మల్టీ స్టారర్ సినిమాలు మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటాయి.

 Tollywood Biggest Multistarrers Details, Tollywood, Tollywood Multistarrers, Ve-TeluguStop.com

ప్రేక్షకుల మదిలో మెదిలిన ఆలోచన మల్టీస్టారర్ గా అటు తెరమీద కనిపిస్తే ఇక అంతకంటే ఆనందం ఏముంటుంది.ఇలా గత పదేళ్లలో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.ఇక ఆ వివరాలు ఇప్పుడు తెలుసు కుందాం.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు :

సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అందర్నీ కూడా తెగ ఆకర్షించి మంచి విజయాన్ని అందుకుంది.

Telugu Bheemla Nayak, Devadas, Gopala, Manam, Masala, Oopiri, Sithammavakitlo, T

మసాలా :

విక్టరీ వెంకటేష్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోలుగా విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మసాలా సినిమా భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ కాస్త నిరాశ పరిచింది అని చెప్పాలి.

Telugu Bheemla Nayak, Devadas, Gopala, Manam, Masala, Oopiri, Sithammavakitlo, T

మనం :

అక్కినేని ఫ్యామిలీ లో ఉన్న హీరోలు అందరూ కూడా కలిసి నటించిన చిత్రం మనం.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.ఈ సినిమాను అక్కినేని కుటుంబ కథా చిత్రంగా పిలుచు కుంటారు.

Telugu Bheemla Nayak, Devadas, Gopala, Manam, Masala, Oopiri, Sithammavakitlo, T

గోపాల గోపాల :

వెంకటేష్ పవన్ కళ్యాణ్ హీరోలుగా మల్టీస్టారర్ గా  భారీ అంచనాల మధ్య 2015 లో సంక్రాంతికి విడుదలైన  ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.  ఏకంగా దేవుడి పాత్రలో నటించాడు పవన్ కళ్యాణ్.

Telugu Bheemla Nayak, Devadas, Gopala, Manam, Masala, Oopiri, Sithammavakitlo, T

ఊపిరి :

టాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ హీరో కార్తీ హీరోలుగా నటించిన ఊపిరి సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఇక ప్రతి ఒక్క ప్రేక్షకుడికి సినిమా మెప్పించింది.

Telugu Bheemla Nayak, Devadas, Gopala, Manam, Masala, Oopiri, Sithammavakitlo, T

దేవదాస్ :

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నాచురల్ స్టార్ నాని హీరోలుగా తెరకెక్కిన దేవదాసు సినిమా 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

Telugu Bheemla Nayak, Devadas, Gopala, Manam, Masala, Oopiri, Sithammavakitlo, T

ఎఫ్ 2 :

కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఎఫ్ 2 సినిమా లో వెంకటేష్,  వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.2019 లో సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

Telugu Bheemla Nayak, Devadas, Gopala, Manam, Masala, Oopiri, Sithammavakitlo, T

వెంకీ మామ :

రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేష్ నాగ చైతన్య రీల్ లైఫ్ లో కూడా వెంకీ మామ సినిమాలో నటించారు.ప్రపంచంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Telugu Bheemla Nayak, Devadas, Gopala, Manam, Masala, Oopiri, Sithammavakitlo, T

బంగార్రాజు :

నాగ చైతన్య నాగార్జున హీరోలుగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన బంగార్రాజు సినిమా 2022 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

Telugu Bheemla Nayak, Devadas, Gopala, Manam, Masala, Oopiri, Sithammavakitlo, T

భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రేక్షకులు మెచ్చిన మల్టీస్టారర్ గా మిగిలి పోయింది.

Telugu Bheemla Nayak, Devadas, Gopala, Manam, Masala, Oopiri, Sithammavakitlo, T

త్రిబుల్ ఆర్:

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా లో చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube