బెంజ్ కార్ ఎలా కొన్నావని అడిగినందుకు హిమజ ఏకంగా....

తెలుగులో ప్రముఖ రియాల్టీ గేమ్ షో అయినటువంటి బిగ్ బాస్ మూడో సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి హిమజ గురించి తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది.

 Himaja, Tollywood, Big Boss,  Netizen, Telugu Actress, Mercedes Benz Car-TeluguStop.com

అయితే ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బాగా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంది.

అయితే ఇందులో భాగంగా తాజాగా హిమజ తన మెర్సిడెస్-బెంజ్ కారుతో ఫోటోలు దిగి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది.

దీంతో  ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ డబ్బులే లేవని అంటావు మరి బెంజ్ కారు ఎలా కొన్నావ్ అని ప్రశ్నించాడు.దీంతో ఈ కామెంట్ పై హిమజ స్పందించింది.ఇందులో తాను ఈ బెంజ్ కార్ ని  ఇన్స్టాల్మెంట్ రూపంలో ఒక్క రూపాయి కూడా కట్టకుండా తీసుకున్నానని తెలిపింది.అలాగే ప్రతి నెల 4వ తారీఖున ఈఎంఐ కట్టాల్సి ఉంటుందని కూడా తెలిపింది.

ఎప్పుడైనా ఈఎంఐ కట్టడానికి డబ్బులు ఇబ్బంది అయితే మీకు ఫోన్ చేస్తా వచ్చి డబ్బు కట్టు అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది.దీంతో హిమజా ఇచ్చినటువంటి రిప్లై కి కొందరు నెట్లో మద్దతు తెలియజేస్తున్నారు.

అంతేకాక ప్రస్తుత కాలంలో కొందరు నెటిజన్లు సెలబ్రిటీలపై అనుచిత కామెంట్లు చేస్తూ పాపులర్ కావాలని అనుకుంటున్నారని అలాంటి వారికి ఇలాగే  బుద్ధి చెప్పాలని అంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా అప్పట్లో టాలీవుడ్ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసారమయ్యే కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్ ద్వారా హిమజ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడమేగాక పలు సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు ఒకపక్క షోలు మరోపక్క సినిమా అవకాశాలు అంటూ బిజీబిజీగా గడుపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube