అందుకే బిగ్ బాస్ షో కి సుమక్క వెళ్లదంట...

తెలుగు బుల్లితెరలో తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు యాంకరింగ్ క్వీన్ సుమ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్  సుమ స్వతహాగా మలయాళ భాషికి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించి తన తీయనైన మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.

 Tollywood Beautiful Anchor Suma About Big Boss Show,  Suma, Tollywood Beautiful-TeluguStop.com

కాగా తాజాగా తెలుగులో ప్రముఖ రియాల్టీ గేమ్ షో అయిన బిగ్ బాస్ షో లో ఆదివారం రోజున యాంకర్ సుమ సండే ఫండే కార్యక్రమంలో పాల్గొంది.

ఇందులో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల పై తనదైన శైలిలో జోకులు పేలుస్తూ అందరిని నవ్విస్తూ బాగానే సందడి చేసింది.

అంతేకాక తనకి  బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ఉన్నప్పటికీ ప్రస్తుతం పలు తెలుగు సినిమాల ఆడియో రిలీజ్ ఈవేంట్లు, అలాగే పలు ప్రెస్ మీట్లు వంటి కార్యక్రమాలు చాలానే ఉన్నాయని అందువల్లనే ఇప్పుడప్పుడే తాను బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనలేనని సరదాగా చెప్పుకొచ్చింది.

కానీ ఇటీవలె బిగ్ బాస్ షోలో 59 ఏళ్ల వయసులో కంటెస్టెంట్ గా పాల్గొన్న గంగవ్వ వయస్సు వచ్చిన తర్వాత తాను కూడా బిగ్ బాస్ షోలో పాల్గొంటానని చెబుతూ అందరినీ నవ్వించింది.

ఇక చివరలో బిగ్ బాస్ షోలో పాల్గొనాలంటే చాలా ధైర్యం ఉండాలని, అంతేగాక ముఖ్యంగా మన గురించి మనకి బాగా తెలిసి ఉండాలని ఎప్పుడూ కూడా మనోధైర్యం కోల్పోకుండా ఆడేటువంటి వారికి ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుందని అంటూ కంటెస్టెంట్లకి ఎనర్జీ బూస్టింగ్ ఇచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ సుమ తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీ లో ప్రసారమయ్యే “క్యాష్ – దొరికినంత దోచుకో, స్టార్ మహిళ” తదితర షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ బాగానే రాణిస్తోంది.

అంతేగాక మరోపక్క పలు చిత్రాల ఆడియో ఈవెంట్లు మరియు ఇతర సంబంధిత ఈవెంట్లలో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube