రెండవ సారి సీఎం అయిన కేసీఆర్‌ గారికి టాలీవుడ్‌ విజ్ఞప్తి.. ఈసారైనా పట్టించుకునేనా?

తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ రెండవ సారి నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెల్సిందే.సీఎంగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఎన్నో వర్గాల్లో ఆసక్తి, అంచనాలు ఉన్నాయి.

 Tollywood Appeals To Telangana Second Cm Kcr-TeluguStop.com

మొదటి సారి తమకు న్యాయం చేయలేక పోయిన కేసీఆర్‌ ఈసారి అయినా తమకు న్యాయం చేస్తాడని, తమను ఆదుకుంటాడని అంతా భావిస్తున్నారు.వారిలో తెలుగు సినీ పరిశ్రమ వారు కూడా ఉన్నారు.

సీఎం కేసీఆర్‌ మొదటి దఫాలో తెలుగు సినిమా గురించి పెద్దగా పట్టించుకోలేదు.మొదట కొన్ని ప్రకటనలు చేసినా కూడా అవి కేవలం ప్రకటనల వరికే సరి పోయింది.కాని ఈసారి మాత్రం ఆయన నుండి సాయంను ఆశిస్తున్నట్లుగా సినీ పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ వారు అంటున్నారు.మా కోసం ఇప్పటి వరకు సొంత భవనం లేదు.

చాలా ఏళ్లుగా అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.కాని అది ఎవరికి సాధ్యం కావడం లేదు.

కేసీఆర్‌ దాని గురించి అనుకుంటే అయిపతుందని, భవనం నిర్మాణంకు స్థలం కేటాయించడంతో పాటు, భవనం నిర్మాణంకు ఆర్థిక సాయంను కేసీఆర్‌ చేయాలని సినీ ఇండస్ట్రీ వారు కోరుతున్నారు.

సినిమా పరిశ్రమ ఏర్పడి, మా ఏర్పాటు అయ్యి సిల్వర్‌ జూబ్లీ అవుతున్న సందర్బంగా మా బిల్డింగ్‌ మొదలు పెట్టాలని మా కార్యవర్గం కోరుకుంటుంది.అందుకోసం కేసీఆర్‌ను కలిసి సాయం చేయాలని కోరబోతున్నట్లుగా తెలుస్తోంది.మొదటి దఫాలో నంది అవార్డుల గురించి కూడా పట్టించుకోని కేసీఆర్‌ ఈసారైనా వాటిని గురించి పట్టించుకోవాలని సినీ వర్గాల వారు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube