ఒక సినిమా థియేటర్ లో రిలీజ్ అయిందంటే… ఆ సినిమా ఫలితాన్ని సూపర్ హిట్.హిట్… ఎబోవ్ యావరేజ్… యావరేజ్ గా చెప్పుకుంటారు.కానీ గత కొంత కాలంగా చూస్తే కేవలం రెండే రెండు మాటలు వినిపిస్తున్నాయి.సినిమా హిట్ అయిందా… ఫట్ అయిందా అంతే.అయితే ఇలా టాలీవడ్ ట్రెండ్ మారిపోవడానికి కారణం సోషల్ మీడియా అని చెప్పవచ్చు.గతంలో సినిమా ఫలితం సినిమా చూసిన తరువాత వారి నుండి వచ్చే స్పందను ఆధారంగా చేసుకుని సినిమా హిట్ లేదా ప్లాప్ అన్నది తెలిసేది.
కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజు నుండే సినిమా ఫలితాన్ని సోషల్ మీడియాలో ఫస్ట్ రివ్యూ, ఓవర్ సీస్ రివ్యూ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
అయితే ఈ సోషల్ మీడియా బారి నుండి ఒక సినిమా బయటపడాలంటే ఖచ్చితంగా మంచి కథ, కథనం ఉండి ఎవ్వరూ కామెంట్ చేయలేని విధంగా డైరెక్టర్ టేకింగ్ ఉంటే ఎవ్వరూ దానిని ఆపలేరు.
కానీ సినిమాలో ఏ మాత్రం నెగిటివ్ ఉన్నా… అందులో ఉన్నా మైనస్ పాయింట్ లు అన్నీ కట్ చేసి మరీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి పరువు తీస్తున్నారు.అయితే ఒక హీరో సినిమా వస్తే… ఆ హీరోకు యాంటీగా ఉన్నా మరో హీరో అభిమానులు దానిని ఎలాగైనా ప్లాప్ చెయ్యాలి అని కంకణము కట్టుకు కూర్చుంటారు.
సినిమాలో నెగిటివ్ పాయింట్స్ లేకపోయినా ఏదో ఒకటి పెడుతూ రాక్షసానందం పొందుతుంటారు.ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న చర్చ ఇదే.అయితే పైన హీరోలు అంతా హ్యాపీ గా కలిసిమెలసి ఉంటే వీరు మాత్రం ఇలా చేసుకుంటూ సినిమాల ఫలితాలను మార్చేస్తున్నారు.

గతంలో ఇదే విధంగా రాధే శ్యామ్, ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాలకు జరిగింది.ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది ఏమిటంటే… మా హీరో సినిమా హిట్ కాలేదు.అలాంటప్పుడు మీ హీరో సినిమా హిట్ కాకూడదు అన్న విషయాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకుని ప్రవర్తించాలి… నిర్మాత కోట్లు పెట్టి సినిమా తీస్తే.మీరిలా ఇగోకి పోయి సినిమాలను మీ బ్యాడ్ రివ్యూలను ఇస్తూ వారికీ తీవ్ర నష్టం కలిగించడం కరెక్ట్ కాదు.
మరి ఇది ఇప్పటికి సమసి పోతుంది అనేది తెలియాల్సి వస్తుంది.