టాలీవుడ్ స్టార్‌ హీరో సినిమా = నయనతార పెళ్లి

టాలీవుడ్‌ కు చెందిన ఒక స్టార్‌ హీరో సినిమా విడుదలకు ముందు ఎంత ఓటీటీ రైట్స్ ను అయితే పలుకుతుందో అదే స్థాయిలో నయనతార పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కులకు గాను నెట్‌ ఫ్లిక్స్ వారు ఇచ్చారట.ఇది కొత్త పద్దతి.

 Tollywood And Kollywood Heroine Nayanatara Marriage Video Streaming In Netflix D-TeluguStop.com

ఇండియాలో ఇలాంటివి గతంలో జరిగినా కూడా మరీ ఇంత కమర్షియల్‌ గా అది కూడా ఒక ప్రముఖ ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేయడం అనేది చాలా అరుదుగా జరగడం అవుతుంది.ఇప్పుడు మన సౌత్ ఇండియన్ హీరోయిన్‌ నయనతార విషయంలో జరిగింది.

భారీ మొత్తం ను చెల్లించి మరీ నయనతార మరియు విఘ్నేష్ శివన్ ల యొక్క పెళ్లి వీడియో స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ ఫ్లిక్స్ కొనుగోలు చేయడం జరిగింది.అతి త్వరలోనే ఆ పెళ్లి తంతును స్ట్రీమింగ్‌ చేయడం కు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి.

భారీ ఎత్తున ప్రమోషన్ ను చేయడం ద్వారా నెట్‌ ఫ్లిక్స్ బాగా క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు.పెళ్లికి అయిన ఖర్చుకు దాదాపుగా మూడు నాలుగు రెట్ల రూపాయలు నయన్‌ మరియు విఘ్నేష్‌ లు నెట్‌ ఫ్లిక్స్ ద్వారా రాబట్టే అవకాశం ఉంది అంటున్నారు.

స్టార్‌ హీరోల సినిమా ల యొక్క స్ట్రీమింగ్‌ రైట్స్ తో సమానంగా ఈ స్టార్‌ కపుల్‌ యొక్క పెళ్లి వీడియో స్ట్రీమింగ్‌ హక్కులు కొనుగోలు చేయడం ద్వారా ముందు ముందు కొత్త కొత్త బిజినెస్ ను నెట్‌ ఫిక్స్‌ ప్రారంభించినట్లు అయ్యింది.

Telugu Nayanatra, Nayanthara, Netflix, Telugu, Tollywood, Vignesh Shivan-Movie

ఇక నుండి చిన్న సెలబ్రెటీ కూడా తమ పెళ్లి వీడియోలను యూట్యూబ్‌ లకు లేదా ఓటీటీ లకు అమ్మేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.ఇంకా ఎన్ని ఎన్ని మార్పులు మరియు సంచలన నిర్ణయాలు చూడాల్సి వస్తుందో అంటూ కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు.ప్రస్తుతం నయనతార అభిమానులు సినీ ప్రేమికులు నెట్‌ ఫ్లిక్స్ వారు విడుదల చేసిన పెళ్లి ప్రోమో ను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube