సినిమా ఇండస్ట్రీ లో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు ఈమద్య కాలంలో బాగా ఒంట బట్టించుకున్నారు.
ఆఫర్లు లేని సమయంలో అత్యాశకు వెళ్తే ఏం జరుగుతుందో ఇప్పటికే కొందరు హీరోలు మరియు హీరోయిన్స్ ను చూస్తే అర్థం అవుతోంది.హీరోలు మరియు హీరోయిన్స్ కొందరు తమ కు దక్కిన సక్సెస్ లు.తాము చేసిన పెద్ద సినిమాల ఆధారంగా మాత్రమే పారితోషికంను డిమాండ్ చేయాల్సి ఉంటుంది.అంతే తప్ప ఇష్టం వచ్చినట్లుగా పారితోషికం డిమాండ్ చేస్తే కెరీర్ లో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రస్తుతం ఒక హీరోయిన్ అదే పని చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుంది.తెలుగు లో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.కొన్నాళ్లు తెలుగు లో బాగానే సినిమా లు చేసింది.కాని కమర్షియల్ గా ఆమెకు సక్సెస్ లు దక్కలేదు.
దాంతో ఆమె బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది.
అక్కడ చిన్నా చితకా సినిమా ల్లో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమా లకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా నిలిచింది.
బోల్డ్ గా నటించకుండా.అందాల ఆరబోత చేస్తూ సాధ్యం అయినంత వరకు అందరికి సన్నిహితంగా ఉంటూ బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరింది.
ఆమె చేసిన సినిమా లు కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా కూడా వసూళ్ల విషయంలో నిరాశ పర్చినా కూడా నటన మార్క్ తో మంచి విజయాన్ని దక్కించుకుంది.అందుకే ఈమద్య కాలంలో ఆమె కు బాగానే ఆఫర్లు వస్తున్నాయి.
ఆఫర్లు వస్తున్నాయి కదా అని భారీగా డిమాండ్ చేస్తే ఎలా.ఇప్పుడు ఆమె అదే చేస్తుంది.కమర్షియల్ గా సక్సెస్ లు లేకుండా ఆఫర్లు రావడం గగనం.అలాంటప్పుడు పారితోషికం విషయం లో చూసి చూడనట్లుగా వ్యవహరించాలి.అంతే తప్ప పారితోషికం అంతలా డిమాండ్ చేస్తే ఎలా అంటున్నారు.రెండున్నర కోట్ల నుండి మూడున్నర కోట్ల వరకు ఆమె డిమాండ్ చేస్తుందట.
నిర్మాతలు మాత్రం ఆమెకు రెండు కోట్ల వరకు ఇచ్చేందుకు ఓకే చెబుతున్నారు.