30 ఏళ్ళు దాటిన పెళ్లి ఊసెత్తని బుల్లితెర యాంకర్స్ వీళ్ళే..!

బ్యాచ్ లర్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది.ఏ బాధా బందీ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు.

 Tollywood Anchors Who Are Single After 30s-TeluguStop.com

అందుకే చాలా మంది పెళ్లి చేసుకునే సమయంలో స్నేహితులు ఆటపట్టిస్తుంటారు.బ్యాచిలర్ లైఫ్ అయిపోయింది.

ఇక నీ జీవితం నాశనమే అంటూ పెళ్లి కొడుకుని ఏడిపిస్తారు.ఒకప్పుడు పిల్లలకి 20 ఏళ్లు నిండీ నిండకముందే పెళ్లి చేసేవాళ్లు.

 Tollywood Anchors Who Are Single After 30s-30 ఏళ్ళు దాటిన పెళ్లి ఊసెత్తని బుల్లితెర యాంకర్స్ వీళ్ళే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది అబ్బాయి అయినా.అమ్మాయి అయినా సరే.ఇప్పుడు 30 నుంచి 35 ఏళ్లు దాటేవరకు పెళ్లి చేసుకోవడం లేదు.ఎందుకంటే సెటిల్ అవ్వాలి కదా.అని అంటున్నారు.

అలాగే మన సెలబ్రిటీలు కూడా అప్పుడే ఏం తొందర అంటూ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నవారు చాలా మందే ఉన్నారు.

ఇక బుల్లితెరపై అయితే కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నా అంటూ పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు.అలాంటి సెలబ్రిటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాంమూడు పదులు దాటి ఐదేళ్లయినా రష్మీ గౌతమ్ ఇప్పటికీ పెళ్లి ఊసెత్తడం లేదు.

సీరియల్స్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చినా.తర్వాత యాంకర్ గా పేరు తెచ్చుకుంది.

జబర్దస్త్ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.అసలు రష్మీ అంటే ఆ షో ద్వారానే ప్రేక్షకులకు దగ్గరైంది.

జబర్దస్త్ తర్వాత ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చాయి.అడపాదడపా సినిమాలు చేసుకుంటూ యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తుంది.

తెలుగు రాకపోయినా షోలను నడిపిస్తుంది.అయితే 30 ఏళ్లు దాటాయి కదా ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటావా అని అడిగితే.

అప్పుడే ఏం తొందర ముందు కెరీర్ పై ఫోకస్ పెట్టనివ్వండి అంటూ ఓ ఇంటర్వ్యూలో సమాదానమిచ్చింది.

Telugu Pradeep, Rashmi Gouatham, Sudigali Sudheer, Telugu Anchors Age, Telugu Anchors Unmarried-Telugu Stop Exclusive Top Stories

స్మాల్ స్ర్కీన్ పై కమెడియన్ కమ్ డాన్సర్ కమ్ యాంకర్ కమ్ మెజీషియన్ .అన్ని పేర్లు ఆయనకే సూట్ అవుతాయని నిరూపించిన మరో నటుడు సుడిగాలి సుధీర్.జబర్దస్త్ షోతో తనని తానూ ప్రూవ్ చేసుకున్నాడు.

కొన్ని సినిమాల్లో హీరోగానూ చేశాడు.అయితే ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

సుధీర్ కి కూడా 30 ఏళ్లు దాటాయి.అయినా పెళ్లి చేసుకోవాలన్న ధ్యాస లేదు.

బుల్లితెరపై సుధీర్ , రష్మీ జోడికి మాంచి క్రేజ్ ఉంది.స్క్రీన్ పై సుధీర్, రష్మీ కనిపిస్తే మ్యాజిక్ క్రియేట్ అవుతుంది.

వీళ్లిద్దరినీ ప్రేమ జంటగా చూపిస్తుంటారు.అందుకే ఈ జంటకు ఫాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కానీ అలాంటిదేమీ లేదని తామిద్దరం మంచి స్నేహితులమని చెబుతూ వస్తున్నారు.

Telugu Pradeep, Rashmi Gouatham, Sudigali Sudheer, Telugu Anchors Age, Telugu Anchors Unmarried-Telugu Stop Exclusive Top Stories

బుల్లితెరపై అమితమైన క్రేజ్ సంపాదించుకున్న వారిలో యాంకర్ ప్రదీప్ ఒకరు.సుమ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ప్రదీప్.సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు.30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.తనని తాను నిరూపించుకున్నాడు.అటు సినిమాల్లో, ఇటు యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు.35 ఏళ్లు దాటినా పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదు.స్టార్ మాలో వచ్చిన పెళ్లి చూపులు.

షోలానే మిగిలిపోయింది.పెళ్లి గురించి అడిగితే ఈ ఏడాది తన పెళ్లి లేనట్టేనని ఇటీవలె ప్రదీప్ చెప్పిన విషయం తెలిసిందే.

Telugu Pradeep, Rashmi Gouatham, Sudigali Sudheer, Telugu Anchors Age, Telugu Anchors Unmarried-Telugu Stop Exclusive Top Stories

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన నటి రోహిణి.ఈ సీరియల్ ద్వారా రోహిణికి మంచి నటిగా గుర్తింపు వచ్చింది.అటు జబర్దస్త్ షోతో పాటు పలు సీరియల్స్ల్ లోనూ నటిస్తుంది.బిగ్ బాస్ 3లో పార్టిసిపేట్ చేసింది.మల్టీ టాలెంటెండ్ గా పేరుపొందిన రోహిణి కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు.

Telugu Pradeep, Rashmi Gouatham, Sudigali Sudheer, Telugu Anchors Age, Telugu Anchors Unmarried-Telugu Stop Exclusive Top Stories

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హిమజ.ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.ఇప్పటికీ సినిమా ఆఫర్లతో బిజీగా గడుపుతుంది.

బిగ్ బాస్ 3లోనూ కంటెస్టెంట్ గా పాల్గొంది.ఇప్పుడు హిమజకు 30 ఏళ్లు దాటినా పెళ్లి గురించి ఊసేఎత్తడం లేదు.

Telugu Pradeep, Rashmi Gouatham, Sudigali Sudheer, Telugu Anchors Age, Telugu Anchors Unmarried-Telugu Stop Exclusive Top Stories

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.బిగ్ బాస్ తర్వాత అతనికి అవకాశాలు బాగా వస్తున్నాయి.అయితే ఈ సింగర్ కు 30 ఏళ్లు వచ్చినా పెళ్లి గురించి ఆలోచించడం లేదు.

Telugu Pradeep, Rashmi Gouatham, Sudigali Sudheer, Telugu Anchors Age, Telugu Anchors Unmarried-Telugu Stop Exclusive Top Stories

బుల్లితెరపై హీరోగా పేరు తెచ్చుకున్న మరో నటుడు రవికృష్ణ.వరూధిని పరిణయం.ఆమె కథ వంటి సీరియల్స్ లో ఫేమ్ ని సంపాదించుకున్నాడు.

ఈ హీరో కూడా 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకునే ఆలోచన కనిపించడం లేదు.అయితే రవికృష్ణ తల్లిదండ్రులు మాత్రం ఈ ఏడాది కొడుకుకి పెళ్లి చేస్తామని అన్నారు.

Telugu Pradeep, Rashmi Gouatham, Sudigali Sudheer, Telugu Anchors Age, Telugu Anchors Unmarried-Telugu Stop Exclusive Top Stories.

#TeluguAnchors #Pradeep #Rashmi Gouatham

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు