కరోనా వైరస్ ప్రభావం తగ్గేంతవరకు ఆ యాంకర్స్ షూటింగులకు రారట…  

Suma Kanakala, Anasuya, Tollywood anchors, Shooting update, corona virus, Tollywood, Cash Program, jabardath - Telugu Anasuya, Cash Program, Corona Virus, Jabardath, Shooting Update, Suma Kanakala, Tollywood, Tollywood Anchors

ప్రస్తుతం బుల్లితెర సినీ పరిశ్రమలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సీరియల్ నటీనటులు ఈ కరోనా వైరస్ బారిన పడడంతో కొన్ని ధారావాహికల నటీనటులు షూటింగులకు హాజరు కావాలంటే భయపడుతున్నారు.

 Tollywood Anchors Suma And Anasuya Decide To Not Attending Shooting For Coronavirus

దీనికి తోడు కరోనా వైరస్ రాకుండా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ ఏదో ఒక రకంగా కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టిస్తూనే ఉంది.

అయితే తెలుగు బుల్లితెర మీద తమ గలగల మాటలతో పలు షోలు, ఈవెంట్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న యాంకరింగ్ క్వీన్ సుమ, టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితుల ప్రభావం తగ్గేంతవరకు కొంతకాలం పాటు షూటింగులకు హాజరు కాకూడదని నిశ్చయించుకున్నట్లు సమాచారం.

కరోనా వైరస్ ప్రభావం తగ్గేంతవరకు ఆ యాంకర్స్ షూటింగులకు రారట…-Latest News-Telugu Tollywood Photo Image

ఇప్పటికే తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీలోస్వాతి చినుకులు, బంధం సీరియళ్లలో నటించే భరద్వాజ్ అనే నటుడికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.అలాగే నా పేరు మీనాక్షి సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి కి  కూడా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

అందువల్లే ఈ ఇద్దరి యాంకర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ సుమ ఈ టీవీలో ప్రతి శనివారం రాత్రి 9. 30 నిమిషాలకు ప్రసారమయ్యే  “క్యాష్ – దొరికినంత దోచుకో” అనే గేమ్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరి స్తోంది.మరోవైపు పు యాంకర్ అనసూయ కూడా ఇదే ఛానల్ లో ప్రతి గురువారం రాత్రి 9. 30 నిమిషాలకు ప్రసారమయ్యే  “జబర్దస్త్ కామెడీ షో”లోయాంకరింగ్ నిర్వహిస్తోంది.ఉన్నట్లుండి  ఈ యాంకర్లు  షూటింగులకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంటే మరి షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

#Jabardath #Shooting Update #Anasuya #Cash Program #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Anchors Suma And Anasuya Decide To Not Attending Shooting For Coronavirus Related Telugu News,Photos/Pics,Images..