వామ్మో... సుమక్క ఒక్క ఎపిసోడ్ కి అంత తీసుకుంటుందట...

తెలుగు బుల్లితెర మీద తన గల గల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించేటువంటి యాంకరింగ్ క్వీన్ సుమ గురించి వెండి తెర, బుల్లి తెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే సుమ ప్రస్తుతం పలు రకాల షోలు, ఈవెంట్లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు బిజీబిజీగా గడుపుతోంది.

 Anchor Suma Remuneration For Tv Shows,suma, Tollywood Anchor, Remuneration News,-TeluguStop.com

అయితే తాజాగా యాంకర్ సుమ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే యాంకర్ సుమ ఒక షో లేదా ఈవెంట్లో యాంకరింగ్ నిర్వహించడానికి దాదాపుగా 2 లక్షల 50 వేల రూపాయలు తీసుకుంటుందని పలు వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అలాగే బుల్లితెర మీద ప్రసారమయ్యే కార్యక్రమాలకి కూడా సుమ బాగానే చార్జ్ చేస్తోందట.దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం యాంకర్ సుమకి ఉన్నటువంటి క్రేజ్ కి ఆ మాత్రం చెల్లిచాల్సిందే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ సుమ ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినటువంటి ఈ టీవీలో ప్రతి శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే “క్యాష్ – దొరికినంత దోచుకో” అనే కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.అంతేకాక యూట్యూబ్ లో కూడా సొంతంగా ఓ ఛానల్ క్రియేట్ చేసి వంటలకి మరియు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాల వీడియోలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube