ప్రదీప్ కు ఐలవ్యూ చెప్పిన శ్రీముఖి.. అసలేం జరిగిందంటే..?

బుల్లితెరపై మేల్ యాంకర్ గా ప్రదీప్ కు, ఫిమేల్ యాంకర్ గా శ్రీముఖికి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.ఈటీవీ, జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన పలు ఎంటర్టైన్మెంట్ షోలకు ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించారు.

 Anchor Srimukhi Says I Love Yout To Pradeep Machiraju On Stage Before All Camera-TeluguStop.com

అయితే శ్రీముఖి మాత్రం కొత్త షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.అయితే తాజాగా డ్రామా జూనియర్స్ షో ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో శ్రీముఖి ప్రదీప్ కు ఐలవ్యూ చెప్పడం గమనార్హం.

కొన్ని నెలల క్రితం ప్రదీప్, శ్రీముఖి జోడీగా ఇద్దరి పెళ్లి అంటూ బుల్లితెరపై ఒక ఈవెంట్ ప్రసారమైన సంగతి తెలిసిందే.అయితే ఆ తర్వాత మాత్రం ప్రదీప్, శ్రీముఖి కలిసి షోలు చేయలేదు.

డ్రామా జూనియర్స్ షోలోకి శ్రీముఖి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలోని అందాలలో పాటతో ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత శ్రీముఖి మానవా మీరు సిద్ధమా.? అని అడగగా గత ఐదేళ్లుగా తాను సిద్ధంగా ఉన్నానని ప్రదీప్ చెబుతాడు.

శ్రీముఖి ప్రదీప్ తో నేను గా నీకు ఇంకో విషయం చెప్పాలని అనుకుంటున్నానని సిగ్గు పడుతూ శ్రీముఖి ఐలవ్యూ చెబుతారు.

జులై 11వ తేదీన రాత్రి 8 గంటలకు ఈ షో ప్రసారమవుతుండగా వాళ్లు మంచి ఫ్రెండ్స్ అని శ్రీముఖి ప్రదీప్ జోడీ చాలా బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.కొందరు మాత్రం టీఆర్పీ కోసం శ్రీముఖి ప్రదీప్ కు ఐలవ్యూ చెప్పారని కామెంట్లు చేస్తున్నారు.

శ్రీముఖి, ప్రదీప్ ఒకవైపు బుల్లితెర షోలతో బిజీగా ఉండటంతో పాటు మరోవైపు వెండితెరపై కూడా సత్తా చాటుతుండటం గమనార్హం.ప్రోమోలో శ్రీముఖి ప్రదీప్ చేతులు పట్టుకుని కనిపించారు.అయితే శ్రీముఖి ప్రదీప్ కు ఎందుకు ఐలవ్యూ చెప్పారో తెలియాలంటే షో ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube