మానవత్వం చచ్చిపోయిందంటూ ఎమోషనల్ అయిన స్టార్ యాంకర్…   

Rashmi gautam, tollywood beautiful anchor, emotional on twitter, Nellore insulting incident - Telugu Emotional On Twitter, Nellore Insulting Incident, Rashmi Gautam, Tollywood Beautiful Anchor

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి నెల్లూరు జిల్లా పర్యాటక అభివృద్ధి శాఖ కార్యాలయంలో జరిగినటువంటి ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ విషయం ఏంటంటే పర్యాటకాభివృద్ధి శాఖ కార్యాలయంలో పనిచేసేటువంటి ఓ ఉన్నతాధికారి తన కిందిస్థాయి అధికారిణి ని కాళ్లతో తన్నుతూ, దారుణంగా కొడుతూ అవమానించిన వీడియో ప్రస్తుతం కంటతడి పెట్టిస్తోంది.

 Tollywood Anchor Rashmi Gautam Twitter

అయితే తాజాగా ఈ విషయం గురించి టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్ స్పందించింది.ఇందులో భాగంగా ఈ వీడియోని ట్యాగ్ చేస్తూ మానవత్వం చచ్చిపోయింది అంటూ  తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఎమోషనల్ అవుతూ  ట్వీట్ చేసింది.

అంతేకాక వికలాంగురాలని కూడా చూడకుండా కాలితో దారుణంగా తన్నినటువంటి ఈ ఉన్నత అధికారి మహా అయితే సస్పెండ్ అవుతాడు తప్ప అంతకు మించి ఏది జరగదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.దీంతో కొందరు నెటిజన్లు రష్మీ గౌతమ్ చేసినటువంటి ట్వీట్ ని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

మానవత్వం చచ్చిపోయిందంటూ ఎమోషనల్ అయిన స్టార్ యాంకర్… -Latest News-Telugu Tollywood Photo Image

అంతేకాక మరికొంత మంది నెటిజన్లు అయితే ఏకంగా కిందిస్థాయి ఉద్యోగిపై ఇంతటి దారుణానికి పాల్పడిన ఉన్నతాధికారిని ఉద్యోగంలో నుంచి తీసివేయాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ రష్మి గౌతమ్ టాలీవుడ్ బుల్లితెర మీద ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో కార్యక్రమంలో యాంకర్ గా వ్యవహరిస్తోంది.

అంతేగాక ఇటీవలే కమెడియన్ మరియు హీరో సుడిగాలి సుదీర్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

#Rashmi Gautam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Anchor Rashmi Gautam Twitter Related Telugu News,Photos/Pics,Images..