పెళ్లి విషయంలో నాకు లేని తొందర మీకెందుకంటూ... ఫైర్ అయిన హీరోయిన్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించినటువంటి “తెనాలి రామకృష్ణ ఎల్.

 Varalakshmi Sarathkumar, Tollywood Actress, Marriage News, Tollywood,-TeluguStop.com

ఎల్ బి” అనే చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించినటువంటి కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.కాగా ఈ అమ్మడు తెలుగులో పలు రీమేక్ చిత్రాల్లో కూడా నటించింది.

అయితే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అందుబాటులో ఉంటోంది.అయితే గత కొద్ది కాలంగా అందరి హీరోయిన్ల అలాగే ఈ అమ్మడు కూడా సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి పలు ప్రశ్నలు ఎదుర్కొంటోంది.

అయితే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.

అయితే ఇందులో భాగంగా నెటిజన్ “మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారని” ప్రశ్నించాడు.

దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ స్పందిస్తూ “అదేంటో గాని తాను పెళ్ళి చేసుకునే విషయం అందరి కంటే చివరిగా తనకే తెలుస్తుందని, అలాగే తాను పెళ్లి చేసుకునే సమయంలో ఖచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని అంత వరకు కొంచెం ఓపిక పట్టాలని సమాధానం ఇచ్చింది.అంతేగాక తన గురించి మరే ఇతర విషయాలు లేనట్లు కేవలం పెళ్లి గురించి మాత్రమే అడుగుతున్నారని, అయినా పెళ్లి గురించి తనకు లేని తొందర మీకెందుకని అంటోంది ఈ అమ్మడు.

అయితే ఎప్పుడూ తనపై వస్తున్నటువంటి వ్యాఖ్యలకు స్పందించే టువంటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈసారి తన పెళ్లి వ్యాఖ్యలపై కొంత ఘాటుగానే స్పందించింది.దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టువంటి “నాంది” అనే చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube