వకీల్ సాబ్ తో శృతి చేస్తోందటగా...

తెలుగులో ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి “వకీల్ సాబ్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా చిత్రీకరణ పనులు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది మాత్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదు.

 Shruti Hassan, Tollywood Actress, Vakeel Saab Movie Offer, Tollywood,-TeluguStop.com

దీంతో గత కొద్ది కాలంగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడి గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ విషయంపై హీరోయిన్ శృతి హాసన్ స్పందించింది.

ఇందులో భాగంగా తాను వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నట్లు స్పష్టం చేసింది.దీంతో కొంతమేర పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ విషయం ఊరట కలిగించింది.

అంతేగాక తాను ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టానని తన పాత్రకు ప్రాధాన్యత ఉండేటువంటి కథలు నచ్చితే కచ్చితంగా మరిన్ని సినిమాలు చేస్తానని కూడా తెలిపింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న క్రాక్ చిత్రంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేయగా మంచి ప్రేక్షకాదరణ పొందింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube