తన ప్రియుడు ఓ చిన్న పాపని గర్భవతిని చేశాడంటున్న కళ్యాణ్ రామ్ హీరోయిన్...  

Tollywood Actress Sana Khan Sensational Comments On Her Ex Boy Friend - Telugu Melvin Louis, Melvin Louis News, Sana Khan, Sana Khan Comments On Her Boy Friend, Sana Khan Latest News, Sana Khan Movie News, Sana Khan News

తెలుగులో అప్పట్లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన కళ్యాణ్ రామ్ “కత్తి” సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడీగా ఆడి పాడినటువంటి ముద్దుగుమ్మ సనా ఖాన్ ఇప్పటికీ ప్రేక్షకులకి బాగా గుర్తుంటుంది.అయితే ఆ తరువాత మంచు మనోజ్ నటించిన టువంటి మిస్టర్ నూకయ్య ఈ చిత్రంలో కూడా నటించింది ఈ అమ్మడు.

Tollywood Actress Sana Khan Sensational Comments On Her Ex Boy Friend - Telugu Melvin Louis, Melvin Louis News, Sana Khan, Sana Khan Comments On Her Boy Friend, Sana Khan Latest News, Sana Khan Movie News, Sana Khan News-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సమయంలో బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడంతో వెంటనే బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది.

అయితే ఇటీవల కాలంలో సనా ఖాన్ తన ప్రియుడు మెల్విన్ లూయిస్ తో బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి  సన ఖాన్ అతడి ప్రియుడు మెల్విన్ గురించి రోజుకో విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటోంది.ఇందులో భాగంగా తాజాగా మెల్విన్ ప్రేమ పేరుతో తనను మోసం చేయడమే కాకుండా తనలాంటి అమ్మాయిలను ఎందరినో మోసం చేశాడని పేర్కొన్నారు.

అలాగే వారితో అందినంతా అప్పులు చేస్తూ డబ్బులు ఎగ్గొట్టాడని చెబుతోంది ఈ అమ్మడు.అంతేగాక ఒక చిన్న పాపను కూడా ప్రేమ పేరుతో లోబరుచుకుని గర్భవతిని చేశాడని ఈ విషయం తనకు ఈ మధ్యే తెలిసిందని అన్నారు.

ఈ విషయం తనకు తెలియడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యానని ఇలాంటి వాళ్ళని దేవుడు కఠినంగా శిక్షించాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు టామ్, డిక్ అండ్ హరీ 2 అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.అంతేగాక పలు స్టార్ హీరోల చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో కూడా నటిస్తోంది.అయితే తన బ్రేకప్ విషయం తెలిసినప్పటి నుంచి సనా ఖాన్ అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

జీవితంలో కొందరు వ్యక్తులతో కలిసి ఉండటం కంటే విడిపోవడమే మంచిదని సరిగ్గా మీ విషయంలో కూడా అలానే జరిగిందని అందుకు చింతించవద్దని సూచిస్తున్నారు.జీవితంలో ఇలాంటి అప్పుడప్పుడూ తారస పడుతుంటారని చాకచక్యంగా తప్పించుకుని ముందుకు వెళ్లాలని ధైర్యం చెబుతున్నారు.

తాజా వార్తలు