తెలుగులో ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమికి వచ్చిన మొదట్లో సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మెల్లమెల్లగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మాస్ మహారాజా రవితేజ తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుని బాగానే గుర్తింపు తెచ్చుకుంది.
దీంతో ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందుతోంది. అయితే సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉండేటువంటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగులు లేకపోవడంతో సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తోంది.
ఈ క్రమంలో అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ బీచ్ లో బికినీ దుస్తులు ధరించి అందాల ఆరబోతలో తీసుకున్నటువంటి ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.
కాగా ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్ది కాలంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. అంతేగాక కొంత మంది నెటిజన్లు ఈ ఫోటోలపై స్పందిస్తూ బీచ్ లో బికినీ వేసి రకుల్ మతి పోగొడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు-2 అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.