అలాంటి పాత్రలో నటించాలనుంది.. ప్రియమణి కోరికలు మాములుగా లేదుగా?

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి.తెలుగు సినీ పరిశ్రమలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Tollywood Actress Priyamani Says Her Drems-TeluguStop.com

స్టార్ హీరోల సరసన నటించిన ప్రియమణి తెలుగులోనే కాకుండా హిందీలో కూడా నటించింది.కెరీర్ మొదట్లో తెలుగమ్మాయిగా కనిపించిన ప్రియమణి ప్రస్తుతం గ్లామర్ ను కూడా పరిచయం చేస్తుంది.

తన పెళ్లి తర్వాత గతంలో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి మళ్లీ రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

 Tollywood Actress Priyamani Says Her Drems-అలాంటి పాత్రలో నటించాలనుంది.. ప్రియమణి కోరికలు మాములుగా లేదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Dreams, Priyamani, Rana Daggupati, Tollywood-Movie

ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో కూడా నటించగా తన పాత్రకు మంచి సక్సెస్ అందుకుంది.ఇక బుల్లితెరలో కూడా ఓ డాన్స్ షోలో జడ్జిగా చేస్తుంది.ఇక లేటు వయసులో కూడా తన అందాలను బాగా పరిచయం చేస్తుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ప్రియమణి.ఇదిలా ఉంటే ప్రియమణికి ఓ కోరిక ఉందట.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తనకు ఓ పాత్రలో నటించాలని ఉందని తెలిపింది.

తెలుగు సీనియర్ నటి రమ్యకృష్ణ చేసిన నీలంబరి లాంటి పాత్రలలో చేయాలని తన కోరిక అని తెలిపింది.

నీలంబరి లాంటి పాత్రలతో తన బాడీ లాంగ్వేజ్, తన డైలాగ్ డెలివరీ పొగరుబోతు పాత్రలకు కరెక్టు సరిపోతానని అనుకుంటుందట ప్రియమణి.మొత్తానికి ప్రియమణి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న తరుణంలో ఇలాంటి పాత్రలు వస్తే అసలు కాదనకుండా చేస్తానంటుంది.

Telugu Dreams, Priyamani, Rana Daggupati, Tollywood-Movie

ప్రస్తుతం ప్రియమణి దగ్గుబాటి రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందట.అంతేకాకుండా వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో కూడా బిజీగా ఉందట ప్రియమణి.మొత్తానికి రీ ఎంట్రీ తో కూడా బాగా దూసుకుపోతుంది ప్రియమణి.

#Dreams #Priyamani #Rana Daggupati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు