నా భర్తతో గొడవలు.. సంసారం గుట్టు విప్పిన ప్రియమణి!

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి.ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

 Tollywood Actress Priyamani Says Conflicts With Husband-TeluguStop.com

కెరీర్ మొదట్లో తెలుగమ్మాయిగా కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం గ్లామర్ ను పరిచయం చేస్తుంది.స్టార్ హీరోల సరసన కూడా నటించింది.

ఇక తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ప్రియమణి మళ్లీ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చింది.ఇక తాజాగా తన సంసారం గురించి గుట్టు విప్పింది ప్రియమణి.
ఇటీవలే డైరెక్టర్ రాజ్ డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మాన్ సిరీస్ లో నటించిన ప్రియమణి తన పాత్రకు మంచి గుర్తింపు అందుకుంది.అంతేకాకుండా సీజన్ 1 లో కూడా నటించిన ప్రియమణికి మంచి సక్సెస్ అందింది.

 Tollywood Actress Priyamani Says Conflicts With Husband-నా భర్తతో గొడవలు.. సంసారం గుట్టు విప్పిన ప్రియమణి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి ఈ సిరీస్ గురించి కొన్ని విషయాలు పంచుకుంది.ఇందులో తన పాత్రకు మంచి ప్రాధాన్యం లభించిందని తెలిపింది.

సీజన్ టు లో సమంత బాగా నటించిందని, తన నటనను తమ కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకున్నారని తెలిపింది.ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం గురించి తానేమీ చెప్పలేనని తప్పుకుంది.

ఇక తన వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్న ప్రియమణి తన భర్త గురించి కొన్ని విషయాలు తెలిపింది.తనకు జతగా అద్భుతమైన సహచరుడు తన భర్త ముస్తఫా రాజ్ దొరికాడని తెలిపింది.సపోర్టింగ్ చేసే భర్త దొరకడం తన అదృష్టమని.పెళ్లయ్యాక తన భర్త ఇచ్చే సపోర్టుతో తను సినిమాలు చేయగలుగుతున్నానని పంచుకుంది.

నిజానికి తనకు పెళ్లయ్యాక కూడా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయంటూ.అది తన అదృష్టమని అందుకే తన భర్త తనకు లక్కీ చార్మ్ అని తెలిపింది.ఇక తమ మధ్య చిన్నచిన్న గొడవలు వస్తుంటాయని ఆ సమయంలో తన భర్త తగ్గుతారని అసలు విషయాన్ని బయట పెట్టింది.ఇక ప్రస్తుతం దగ్గుబాటి రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో నటిస్తుంది.

అంతేకాకుండా హీరో వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో కూడా నటిస్తుంది.

#Conflicts #Priyamani #Mustafa Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు