హీరోయిన్ ప్రేమ తెలుగు అభిమానులను ఎందుకు ఇలా మోసం చేస్తుంది

తెలుగు తెరపై చాలా మంది అందమైన అమ్మాయిలు హీరోయిన్లు గా వచ్చి సందడి చేశారు అలాంటి కోవకు చెందిన వారే ప్రేమ ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది లేకపోతే ఇంకో సారి గుర్తు చేసుకుందాం.ప్రేమ ఓంకారం సినిమాలో రాజశేఖర్ తో కలిసి నటించింది ఆ తర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన మా ఆవిడ కలెక్టర్ ఈ సినిమాలో జగపతి బాబు పక్కన హీరోయిన్ గా నటించి ఒక మంచి హిట్ కొట్టారని చెప్పొచ్చు.

 Tollywood Actress Prema Untold Story-TeluguStop.com

అయితే డైరెక్టర్ కోడి రామకృష్ణ 1995లో అమ్మోరు లాంటి గ్రాఫిక్స్ ప్రాధాన్యమున్న సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మళ్లీ అలాగే గ్రాఫిక్స్ ప్రాధాన్యమున్న ఒక సినిమా తీయాలని ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు గారి తో కలిసి దేవి సినిమాని చేయాలని అనుకున్నారు.

అయితే దేవి పాత్రకి ఎవరిని తీసుకుందాం అనుకున్నప్పుడు కోడి రామకృష్ణ మా ఆవిడ కలెక్టర్ సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రేమనీ తీసుకుందామని ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు గారికి చెప్పి ఒప్పించాడు.

 Tollywood Actress Prema Untold Story-హీరోయిన్ ప్రేమ తెలుగు అభిమానులను ఎందుకు ఇలా మోసం చేస్తుంది-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగ దేవత కు సంబంధించిన సినిమా కావడంతో ప్రేమ దానికి సెట్ అవుతుందా లేదా అని డైరెక్టర్ కి ముందుగా కొంచెం డౌట్ ఉన్నప్పటికీ తర్వాత ఆమె తప్ప ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరు అనుకునేంత నమ్మకాన్ని తెప్పించారు ప్రేమ గారు.దేవి సినిమా హిట్టై డైరెక్టర్ కోడి రామకృష్ణ తో పాటు ప్రేమ కూడా మంచి పేరు తీసుకొచ్చింది దీంతో తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ ప్రేమకి పెద్దగా సక్సెస్ రాలేదనే చెప్పాలి.

దేవి సినిమాతోనే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.దేవి సినిమా సక్సెస్ లో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా చాలా ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు.

మోహన్ బాబు డైరెక్టర్ సురేష్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మోహన్ బాబు 500 వ చిత్రం అయిన రాయలసీమ రామన్న చౌదరి సినిమా లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించి మంచి పేరు సంపాదించింది.ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన డి సినిమాలో శ్రీహరి భార్య గా నటించి మంచి పేరు సంపాదించినప్పటికీ తర్వాత ఆమె కెరీర్ పరంగా అది ఏమాత్రం ఉపయోగపడే లేదని చెప్పొచ్చు.జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలో ఒక సాంగ్ లో మెరిసిన అప్పటికీ అది కూడా ఆమెకు పెద్దగా ప్లస్ కాలేదని చెప్పవచ్చు.మిర్చి మూవీ తర్వాత దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడు సినిమాలో జగపతి బాబు పక్కన మహేష్ బాబు తల్లిగా ప్రేమని చేయమంటే చేయనని చెప్పేసింది.

తనకి మంచి క్యారెక్టర్ వస్తేనే తెలుగులో కంబ్యాక్ ఇస్తాను అని ఎప్పటినుంచో చెప్తుంది.

ప్రేమ 2006లో పెళ్లి చేసుకుంది.చాలామంది హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి క్యారెక్టర్లు చేస్తూ చాలా బాగా దూసుకుపోతున్నారు దానికి ఉదాహరణగా రమ్య కృష్ణ గారిని చెప్పచ్చు.బాహుబలి సినిమాలో రానా, ప్రభాస్ తల్లిగా నటించి మంచి గుర్తింపు పొందింది కేవలం ప్రభాస్ తల్లి గానే కాకుండా ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి ఒకప్పుడు రాజుల కాలంలో రాజమాత అంటే ఇలాగే ఉంటుందేమో అని మన కళ్ళకు కట్టినట్టుగా తన నటనతో మనకు చూపించింది.

రమ్య కృష్ణ కాకుండా సరిలేరు నీకెవ్వరు సినిమా లో విజయశాంతి కూడా నటించి తన నటన ప్రతిభను ఇంకోసారి తెలుగు ఇండస్ట్రీ కి చూపించారు.ఒక నిజాయితీగల ఉపాధ్యాయురాలిగా నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్న విజయశాంతి కం బ్యాక్ కూడా అద్భుతంగా ఇచ్చారు.

సీనియర్ హీరోయిన్స్ అందరూ కం బ్యాక్ అదిరిపోయేలా ఇస్తుంటే ప్రేమ మాత్రం వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకుంటూ ఇవి కాదు ఇంకా మంచి క్యారెక్టర్స్ తనకు కావాలని కోరుకుంటుంది.ప్రేమ సినిమాల్లోకి రాకముందు ఎయిర్ హోస్ట్ గా కూడా పనిచేస్తుంది.

ప్రేమ తెలుగులో చివరగా విష్ణు నాగార్జున నటించిన కృష్ణార్జున సినిమా లో నటించింది.చూద్దాం మరి తెలుగు డైరెక్టర్లు ప్రేమ కు తగ్గ క్యారెక్టర్ రాసుకొని ఆమెతో కం బ్యాక్ ఇప్పిస్తారు లేదో చూద్దాం…

.

#Krushnarjuna #Come Back #Actress Prema #Offers #Ammoru

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు