టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.ఈమె ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది.
ఇక ఈ సినిమాతో తన నటనతో తెచ్చుకున్న గుర్తింపు మాత్రం అంతా ఇంతా కాదు.అంతే కాకుండా తన అందంతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది పాయల్.అతి తక్కువ సమయంలో కేవలం ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో అభిమానుల మనసులు గెలుచుకుంది ఈ బ్యూటీ.
2017లో పంజాబీ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకోగా ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది.ఇక ఆ తర్వాత 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమాలో ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది.ఇక ఆ తర్వాత వెంకీ మామ సినిమాలో నటించి బాగా ఆకట్టుకుంది.
ఇక గత ఏడాది రవితేజ సరసన నటించిన డిస్కో రాజా సినిమా లో నటించగా అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

ఇక ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటుంది.తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను పంచుకుంది.అందులో తను ట్రెడిషనల్ లుక్కుతో పాటు.
మోడ్రన్ దుస్తులో కూడా బాగా ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమా అవకాశాలు లేనందున స్పెషల్ సాంగ్ పై ఫోకస్ చేస్తుంది.బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సీత సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేసిన సంగతి తెలిసిందే.
ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహా సముద్రం సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.