మోహన్ బాబుకు కౌంటర్ ఇచ్చిన నాగబాబు.. ఇది మీ కోసమే అంటూ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.ఈ ఎన్నికల విషయంలో రోజురోజుకు కొత్త విషయాలు బయట పడుతుండటంతో ఈ ఎన్నికలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.

 Tollywood Actress Nagababu Gave A Counter To Mohan Babu-TeluguStop.com

ఇప్పటికే ప్రకాష్ ప్యానెల్ సిద్ధం చేయగా అందులోకి జీవిత రాజశేఖర్ ను తీసుకు రావడం,ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి బండ్ల గణేష్ బయటికి వెళ్లి జీవితంపై పోటీ చేయడం ఇవన్నీ రోజు రోజుకు సంచలనంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే సీనియర్ నటుడు మోహన్ బాబు జూమ్ మీటింగ్ ద్వారా చేసిన వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ చేశారు.

ఈ సందర్భంగా మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.ఎన్నికల ప్రచారంలో భాగంగా మేం ప్రకాష్ రాజ్ శక్తి సామర్థ్యాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను కానీ మరే ఇతర విషయాల గురించి మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్న ఇప్పటికే మరికొందరు కావాల్సిగానే వివాదాలకు తెర లేపుతున్నారు అంటూ నాగబాబు స్పందించారు.

 Tollywood Actress Nagababu Gave A Counter To Mohan Babu-మోహన్ బాబుకు కౌంటర్ ఇచ్చిన నాగబాబు.. ఇది మీ కోసమే అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మా ఎన్నికలలో భాగంగా ప్రస్తుతం మా బిల్డింగ్ గురించి తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.జూమ్ మీటింగ్ ద్వారా మోహన్ బాబు మా బిల్డింగ్ ఎందుకు కొన్నారు ఎందుకు అమ్మవారు అనే విషయం గురించి మాట్లాడిన మాటలకు నాగబాబు తనదైన శైలిలో స్పందించారు.

Telugu Actress, Hero, Jeevitha, Mohan Babu, Naga Babu, Prakash Raju, Tollywood-Movie

మోహన్ బాబు గారు ఇండస్ట్రీకి సీనియర్ హీరో ఆయన ఈ విషయం గురించి అడగడంలో తప్పులేదు అయితే సుమారు 14 సంవత్సరాల తర్వాత ఈ విషయం గురించి అడగాల్సిన అవసరం ఏంటి అయినప్పటికీ మోహన్ బాబు ఈ విషయం అడగడంతో నేను సమాధానం చెబుతున్నారు అంటూ అప్పట్లో చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు బిల్డింగ్ కాల్ చేయమని ఒత్తిడి తీసుకురావడంతో అప్పటికి మా దగ్గర ఉన్నటువంటి కోటి 30 లక్షలు ఉన్నాయి.పరుచూరి గారి ఈ సలహా మేరకు శ్రీనగర్ కాలనీలో డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అసోసియేషన్ బిల్డింగ్ కు దగ్గరలో ఓ భవనం కొన్నాము.

ఈ భవనం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కొన్నామని మొత్తం ఆ బిల్డింగ్ కొనడానికి 96 లక్షల వరకు ఖర్చు అయింది.ఆ తర్వాత 2017వ సంవత్సరంలో శివాజీ రాజా అధ్యక్షుడిగా నరేష్ జనరల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఆ బిల్డింగ్ ను కేవలం ముప్పై లక్షల 96 వేలకు అమ్మారు.

అప్పటికి ఆ బిల్డింగ్ ఉన్న స్థలం విలువ కోట్లలో ఉన్నప్పటికీ వీరు కేవలం లక్షల్లో మాత్రమే అది అమ్మడానికి కారణం ఏమిటో వాళ్ళకే తెలియాలి.ఎలాంటి పరిస్థితులలో ఆ బిల్డింగ్ నేను కొన్నాను ఆ విషయాన్ని మీకు చెప్పాను ఎందుకు అమ్మాల్సి వచ్చిందనే విషయాన్ని వాళ్ళు చెప్పాల్సి ఉంటుందని మోహన్ బాబు వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ వేశారు.

#Prakash Raju #Naga Babu #Mohan Babu #Actress #Jeevitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు