బాలయ్య బాబు ఫీట్ ని అందుకున్న టాలీవుడ్ హీరోయిన్...  

Tollywood Actress Mehrene Kaur Pirzada Brakes Balakrishna Record-balakrishna Latest News,balakrishna News,mehrene,mehrene Kaur Pirzada,mehrene Kaur Pirzada Latest News,mehrene Tollywood News

మామూలుగా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూపోయే హీరోల్లో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు.అయితే గతంలో ఈయన నెలకొల్పిన రికార్డును ఓ టాలీవుడ్ హీరోయిన్ సమం చేసింది.

Tollywood Actress Mehrene Kaur Pirzada Brakes Balakrishna Record-Balakrishna Latest News Balakrishna Mehrene

ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా…? ఎవరో కాదు మెహరీన్ కౌర్ పిర్జాద.ఈమె తెలుగులో  నాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రం ద్వారా తెలుగులోకి తెరంగేట్రం చేసింది.

అయితే వచ్చీరావడంతోనే ఈ అమ్మడికి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి.దాంతో కొద్ది రోజులు టాలీవుడ్ లోనే తిరుగులేని హీరోయిన్ గా మెహరీన్ కౌర్ కొనసాగింది.

కాని గత కొద్ది రోజులుగా ఈ అమ్మడి టైం బాగా లేకపోవడంతో కొంతమేర అవకాశాలు తగ్గాయి.

ఇటీవల కాలంలో ఒక హీరో కి సంబంధించిన చిత్రాలు కానీ హీరోయిన్ కి సంబంధించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం లేదు.

కానీ అప్పట్లో బాలయ్య నటించిన నిప్పురవ్వ, సరదా బుల్లోడు చిత్రాలు రెండు ఒకే రోజున విడుదలయ్యాయి.అయితే ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని నటించిన టువంటి జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాలు ఒకే రోజున విడుదల అయ్యాయి.

అప్పటినుంచి ఇప్పటివరకు హీరో, హీరోయిన్లకి సంబంధించిన రెండు చిత్రాలు కూడా ఒకే రోజున విడుదల అవ్వలేదు.కానీ తాజాగా తెలుగులో మెహరీన్ నటించిన టువంటి ఎంత మంచివాడవురా.! చిత్రం, అలాగే తమిళంలో ధనుష్ సరసన నటించిన పటాస్ చిత్రం ఈనెల 15వ తారీఖున విడుదలయ్యాయి.

దీంతో బాలయ్య బాబు రికార్డుని మెహరీన్ సమం చేసింది.అయితే ఇప్పటికే మెహరిన్ తెలుగులో నటించినటువంటి ఎంత మంచివాడవురా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది.అలాగే ఈ అమ్మడు నటించిన టువంటి మరో చిత్రం అశ్వద్ధామ.

ఈ చిత్రం కూడా ఈనెల 30వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది. 

.

తాజా వార్తలు

Tollywood Actress Mehrene Kaur Pirzada Brakes Balakrishna Record-balakrishna Latest News,balakrishna News,mehrene,mehrene Kaur Pirzada,mehrene Kaur Pirzada Latest News,mehrene Tollywood News Related....