అవును.... హీరో నాగశౌర్య తండ్రి నన్ను ఇబ్బంది పెట్టాడంటున్న హీరోయిన్  

Tollywood Actress Mehreen Pirzada Reacts About Producer Issue - Telugu Mehreen Pirzada Latest News, Mehreen Pirzada News, Mehreen Pirzada Producer Issue News, Mehreen Pirzada React About Producer Issue, Tollywood Mehreen

ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా హీరో నాగ శౌర్య నటించినటువంటి అశ్వద్ధామ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Tollywood Actress Mehreen Pirzada Reacts About Producer Issue

దీంతో హీరో నాగ శౌర్య తన కెరియర్ లో మరో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మెహరిన్ ని చిత్ర ప్రమోషన్ వేడుకకి హాజరయ్యే విషయంలో  హీరో నాగ శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ కొంతమేర ఇబ్బంది పెట్టినట్లు పలు కథనాలు వినిపిస్తున్నాయి.

అంతేకాక చిత్ర ప్రమోషన్ ఈవెంట్ కి రాకపోతే హోటల్ బిల్లు కట్టనాని బెదిరించినట్లు కూడా పలు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయంపై తాజాగా మెహరీన్ స్పందించింది.

ఇందులో భాగంగా మెహరీన్ మాట్లాడుతూ ఈ చిత్ర ప్రమోషన్ ఈవెంట్ కి తాను హాజరు కాకపోవడంతో హీరో తండ్రి శంకర్ ప్రసాద్ తనను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమేనని అన్నారు.అందుకుగాను వివరణ కూడా ఇచ్చింది మేహరీన్.

అయితే చిన్నపాటి అలర్జీ సమస్యతో బాధపడుతూ హోటల్ గదిలోనే ఉన్నానని అంతేగాక డాక్టర్లు సూచించినటువంటి మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా నిర్మాతలకి పంపించానని కానీ  వారు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని అన్నారు.అంతేగాక తన మేనేజర్ కి ఫోన్ చేసి ఈవెంట్ కి రాకపోతే హోటల్ బిల్లు కట్టనని కూడా చెప్పిన మాట నిజమేనని అన్నారు.

దీంతో తానే తన మేనేజర్ కి ఫోన్ చేసి హోటల్ బిల్లు కట్టమని చెప్పి అక్కడినుంచి వచ్చేసానని అన్నారు.అయితే ఆ తర్వాత ఇకపై ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదని అంతేగాక ఈ విషయానికి సంబంధించి ఎటువంటి స్టేట్ మెంట్లు కూడా ఇవ్వనని మెహరిన్ పేర్కొంది.

ఈ చిత్రంమంచి హిట్ అయి అవకాశాలు వస్తాయని ఆశ పెట్టుకున్నటువంటి మెహరీన్ ఆశలకు గండి పడినట్లు తెలుస్తోంది.అయితే దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఈ చిత్రానికి  విడుదలైనప్పటి నుంచి పలురకాల వివాదాలు, సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.

తాజా వార్తలు

Tollywood Actress Mehreen Pirzada Reacts About Producer Issue-mehreen Pirzada News,mehreen Pirzada Producer Issue News,mehreen Pirzada React About Producer Issue,tollywood Mehreen Related....