టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి చుక్కలు చూపించిన యంగ్ హీరో తండ్రి...  

Tollywood Actress Mehraeen Pirzada Hurted From Hero Father - Telugu Mehraeen Hurt Nagashourya Father, Mehraeen Pirzada Latest News, Mehraeen Pirzada Movie News, Mehraeen Pirzada News, Tollywood

తెలుగులో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే చిత్రంలో న్యాచురల్ స్టార్ నాని సరసన నటించి వచ్చీరావడంతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా.అయితే ఆ తర్వాత తన అందం, అభినయంతో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ సినీ కెరీర్లో బాగానే రాణిస్తున్నప్పటికీ తనకంటూ సరైన హిట్ లేక పోవడంతో కొంతమేర గుర్తింపుకు నోచుకోవడం లేదు ఈ అమ్మడు.

Tollywood Actress Mehraeen Pirzada Hurted From Hero Father - Telugu Hurt Nagashourya Latest News Movie

అయితే తాజాగా మెహరీన్ తో నటించినటువంటి ఓ హీరో తండ్రి నుంచి చేదు అనుభవం ఎదుర్కొన్నట్లు టాలీవుడ్ సినీ పరిశ్రమలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా మెహరీన్ నాగ శౌర్య నటించిన అశ్వథ్థామ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

ఈ చిత్రాన్ని హీరో నాగ శౌర్య తల్లి ఉష ముళ్ళపూడి నిర్మించారు.అయితే ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా మెహరీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యే సమయంలో తను కొంత అనారోగ్యపరమైన సమస్యలు ఎదుర్కుంటూ ఉండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేనని చెప్పారు.

దీంతో నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ కచ్చితంగా ఈవెంట్ కి రావాలని అంతేగాక ఈ ఈవెంట్ కి టాలీవుడ్ లో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి దర్శకుడు రాఘవేంద్రరావు హాజరవుతున్నారని కాబట్టి హీరోయిన్ కూడా కచ్చితంగా ఉండాలని తెగేసి చెప్పారట.

దీంతో మెహరీన్ వైద్యులు సూచించినటువంటి మందుల రిసిప్ట్ కూడా శంకర్ ప్రసాద్ కి పంపించినప్పటికీ ఆయన ఒప్పుకోకుండా కచ్చితంగా రావాలని ఇబ్బంది పెట్టాడని, ఒకవేళ ఈవెంట్ కి హాజరు కాకపోతే ఇప్పుడు తాను ఉంటున్నటువంటి హోటల్ బిల్లును కూడా కట్టనని బెదిరించారని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఆగ్రహానికి గురైన టువంటి మెహరీన్ వెంటనే హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని హోటల్ సంబంధిత అధికారులు శంకర్ ప్రసాద్ కి ఫోన్ చేసి చెప్పారట.అయితే ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో బాగానే వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో వాస్తవం ఏంటో తెలియాలంటే కచ్చితంగా శంకర్ ప్రసాద్ స్పందించాలని పలువురు నాగశౌర్య అభిమానులు కోరుతున్నారు.

అసలే  సినిమా ప్లాప్ ఐన బాధలో ఉన్నటువంటి నాగ శౌర్య కి ఈ చిత్రం పెద్దగా కలిసి రావడం లేదు.

గతంలో కూడా సిటీలోని క్యాబ్ డ్రైవర్ల మీద పలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొందరు క్యాబ్ డ్రైవర్లు తమకు నాగశౌర్య బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే మూవీ కౌన్సిల్లో ఫిర్యాదు నమోదు చేస్తామని కూడా చెప్పారు.అయితే ఆ వివాదం కొందరు సినీ పెద్దలు కలుగజేసుకోవడం వల్ల సమసిపోయింది.

అయితే మళ్లీ ఇప్పుడు మెహరిన్ వివాదం తెరపైకి వచ్చింది.మరి ఈ వివాదంపై నాగశౌర్య ఎలా స్పందిస్తాడో చూడాలి.

తాజా వార్తలు