కాజల్ పెళ్లి పార్టీ ఇస్తుందట.. కానీ వాళ్ళకి మాత్రమేనట...

తెలుగులో ప్రముఖ దర్శకుడు దేవి సత్యనారాయణ మరియు కృష్ణ వంశీ కలిసి దర్శకత్వం వహించిన “చందమామ” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ చందమామ “కాజల్ అగర్వాల్” గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే కాజల్ అగర్వాల్ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో అడపా దడపా అవకాశాలతో రాణించినప్పటికీ క్రమక్రమంగా వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుని దాదాపుగా 10 సంవత్సరాలుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందుతోంది.

 Tollywood Actress Kajal Aggarwal Big Wedding Party Planning In Hyderabad,  Kajal-TeluguStop.com

కాగా ఇటీవలే కాజల్ అగర్వాల్ ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లు అనే ఓ పారిశ్రామికవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా ఈ పెళ్లి కాజల్ అగర్వాల్ కి సంబంధించినటువంటి అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగింది.

దాంతో కాజల్ అగర్వాల్ హైదరాబాద్ లో సినిమా పరిశ్రమకు చెందినటువంటి సినీ ప్రముఖులు మరియు తన స్నేహితులకు గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలని సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.కానీ ఈ గ్రాండ్ పార్టీ ఎప్పుడు వుంటుందనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంటుంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కాజల్ అగార్వల్ తెలుగు, తమిళ, హిందీ, తదితర భాషల్లో కలిపి దాదాపుగా 5 చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కి జంటగా నటిస్తోంది.

అలాగే తమిళంలో “భారతీయుడు-2” చిత్రంలో కమల్ హాసన్ తో జత కడుతూ 80 సంవత్సరాలు కలిగినటువంటి ఓ వృద్ధురాలి పాత్రలో నటిస్తోంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube