చిల్ అవ్వడానికి ఫ్రెండ్స్ తో కలిసి గోవా కి చెక్కేసిన బిగ్ బాస్ బ్యూటీ...

తెలుగులో మొదటగా బుల్లితెరలో నటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెండితెరపై కనిపించి సినిమా అవకాశాలు దక్కించుకుని బాగానే రాణిస్తున్న నటీనటుల్లో టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు హీరోయిన్ “హిమజ” ఒకరు. అయితే ఈ అమ్మడు మొదటగా ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసారమయ్యే కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా నటిగా పరిచయం అయినప్పటికీ బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Tollywood Actress Himaja Child With Her Friend In Goa, Himaja, Tollywood Actress-TeluguStop.com

కాగా ప్రస్తుతం ఓ చిత్రంలో హీరోయిన్ గా కూడా నటిస్తోంది.

అయితే సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉండేటువంటి హిమజ ఈ మధ్యకాలంలో తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది.

తాజాగా హిమజ తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి గోవా కి వెళ్లినట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా  తాను విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తీసుకున్న ఫోటోని షేర్ చేస్తూ తెలిపింది. అంతేకాక పని నుంచి కొంతమేర విరామం కావాలని అలాగే తాను గోవా వెళ్తున్నట్లు క్యాప్షన్ కూడా పెట్టింది.

 అయితే గోవా కి హిమజతో పాటు టాలీవుడ్ యంగ్ యాంకర్ “భాను శ్రీ” మరియు హీరోయిన్ “నందిని రాయ్” కూడా వెళుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హిమజ తెలుగులో “జ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో ఉండబోతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో మూడవ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ చేతుల మీదుగా ఇటీవలే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే హిమజ పలు తెలుగు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూనే మరోపక్క యూట్యూబ్లో వీడియోలు కూడా చేస్తూ బాగానే సంపాదిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube