విప్పి చూపించిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు…  

Tollywood actress gunnjan aras about bold characters in Films, Gunjan Aras, Tollywood actress, bold characters, Sunny Leone, Tollywood, Wife. I movie heroine - Telugu Bold Characters, Gunjan Aras, Sunny Leone, Tollywood, Tollywood Actress, Tollywood Actress Gunnjan Aras About Bold Characters In Films, Wife. I Movie Heroine

తెలుగులో యంగ్ దర్శ కుడు కళ్యాణ్ దర్శకత్వం వహించిన వైఫ్.ఐ అనే చిత్రం ద్వారా  బాలీవుడ్ బ్యూటీ గుంజన్ ఆరాస్ హీరోయిన్ గా పరిచయమైంది.

TeluguStop.com - Tollywood Actress Gunnjan Aras About Bold Characters In Films

అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడు గురించి దాదాపుగా ఎవరికీ తెలియదు.  తాజాగా గుంజన్ ఆరాస్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా పరిశ్రమలో బోల్డ్ తరహా పాత్రలో నటించే నటీనటుల  గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

TeluguStop.com - విప్పి చూపించిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎక్స్ పోజింగ్ చేసే వాళ్లంతా శృంగార తారలు కాదని కేవలం వాళ్లు పాత్ర డిమాండ్ చేయడం వల్ల వారి పాత్రకి న్యాయం చేయడం కోసం అలా నటిస్తారని అందులో తప్పేముందని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

అంతేగాక తాను కూడా తన నటనా ప్రతిభ నిరూపించుకోవడం కోసం ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి  సిద్ధమేనంటూ తెలిపింది.దీంతో ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి మీరు సన్నీ లియోన్ కావాలని అనుకుంటున్నారా.? అని అడగ్గా దాంతో ఆమె సన్నీ లియోన్ వ్యక్తి గతంగా చాలా మంచిదని కాకపోతే తన గతంలో పరిస్థితుల ప్రభావం దృష్ట్యా అలాంటి చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని కానీ తనకు అంత అవసరం లేదని కానీ తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశాల కోసం కష్టపడి పని చేస్తానని సమాధానం చెప్పింది.

అంతేగాక శృంగార తారకి నటీమణులకు మధ్య తేడా చాలా ఉందని శృంగార తారలు నగ్నంగా వేరే వ్యక్తులతో నటిస్తారని కానీ నటీనటులు మాత్రం ఎప్పుడూ కూడా తమ ప్రైవేట్ శరీర భాగాలను ఎక్స్ పోజ్ చేయకుండా అలాగే ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా నటిస్తారని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఈ మధ్యకాలంలో కొందరు తాము ధరించినటువంటి బట్టలను చూసి కూడా నటీనటుల వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారని అది సరికాదని అభిప్రాయం తెలిపింది.

ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు తెలుగులో నటించినటువంటి వైఫ్.

ఐ అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే  కన్నడలో గుంజన్ ఆరాస్ డెడ్లీ అఫైర్ అనే చిత్రంలో కూడా నటించింది.

అయితే అక్కడ కూడా ఈ అమ్మడికి తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇంటి వద్దనే ఉంటోంది.

#Gunjan Aras #Sunny Leone #Wife.I #Bold Characters

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Actress Gunnjan Aras About Bold Characters In Films Related Telugu News,Photos/Pics,Images..