మరొక సావిత్రిగా మారిన నటి గౌతమి జీవితం..తల్లి పోయాక సర్వం కోల్పోయింది

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వాళ్ళకంటూ ఒక గుర్తింపు కోసం అనుక్షణం పరితపిస్తూ ఉంటారు.అలాంటి వారిలో హీరోయిన్స్ ఒకరు ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకోవడం కోసం అనుక్షణం పరితపించిన హీరోయిన్ ఎవరూ అంటే గౌతమి గారు.

 Tollywood Actress Gauthami Real Life Struggles-TeluguStop.com

ఆవిడ వైజాగ్ కి చెందిన వ్యక్తి అయితే మొదట్లో ఆవిడ తన కజిన్ నిర్మించిన దయామయుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన గాంధీ నగర్ రెండో వీధిలో సినిమాలో నటించి నటిగా మంచి గుర్తింపును సాధించింది.

ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ తమిళంలో రజనీకాంత్, ప్రభు లాంటి హీరోలతో కలిసి గురుశిష్యులు అనే సినిమాలో నటించింది.అలాగే తెలుగు లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా వచ్చిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించి నటిగా మంచి గుర్తింపు సాధించుకుంది.

 Tollywood Actress Gauthami Real Life Struggles-మరొక సావిత్రిగా మారిన నటి గౌతమి జీవితం..తల్లి పోయాక సర్వం కోల్పోయింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగార్జున హీరోగా వచ్చిన చైతన్య సినిమాలో కూడా నటించింది.వాటితో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ తెలుగులో సినిమాలు ఎక్కువ గా చేయలేదు.

తమిళంలో రజనీకాంత్, కమలహాసన్ సినిమాల్లో ఎక్కువగా నటించి అక్కడ మంచి గుర్తింపు సాధించారు.అలాగే అప్పట్లో హీరోయిన్ గా వెలుగొందుతున్న భానుప్రియ, కుష్బూ లాంటివారికి అప్పట్లో గట్టి పోటీని ఇస్తూ వచ్చింది.

కమల్ హాసన్ తో విచిత్ర సోదరులు, క్షత్రియపుత్రుడు, ద్రోహి లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సాధించింది.రజినికాంత్ తో రాజా చిన్న రోజా అనే సినిమాలో నటించి మంచి గుర్తింపును సాధించింది.

ఈవిడ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.ఒకప్పుడు షూటింగ్ లకు ఈమెతో పాటు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చేవారనీ అప్పుడు పెద్దగా బయటి ప్రపంచం గురించి ఆవిడకి అవగాహన లేదని చెప్పారు.అలాగేవాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ప్రపంచ అంటే ఎలా ఉంటుందో తనకి ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పుకొచ్చారు.ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవారు తమ మోసపూరితమైన మాటలతో నమ్మించి మోసం చేస్తారు అని చెప్పుకొచ్చింది.

ఒకప్పుడు కమల్ హాసన్ లాంటి నటుడు తనతో చనువుగా నడుచుకునేవాడని అప్పటికే ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకొని వారిద్దరికీ విడాకులు ఇచ్చారని తెలిసిన కూడా తన మాటలకి నమ్మి మోసపోయాను అని చెప్పారు.అలాగే సారిక గారిని కమలహాసన్ వదిలేసిన తర్వాత తన పిల్లలు అయిన శృతి హాసన్,అక్షర హాసన్ లను సొంత పిల్లలుగా చూస్తున్నానని వాళ్లు ఉండగా తనకు పిల్లలు కూడా అవసరం లేదని పిల్లల్ని కూడా కనకుండా కమల్ హాసన్ తో సహజీవనం చేశానని చెప్పారు.

అయితే ఈ మధ్య కమల్ హాసన్ గౌతమి గారి మధ్య చిన్న గొడవలు రావడంతో ఇద్దరూ విడిపోయి ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారని చెప్పింది.ఈమధ్య గౌతమి వైవిధ్యమైన దర్శకుడు అయిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన మనమంతా సినిమాలో నటించి మంచి గుర్తింపును సాధించారు, అలాగే తను ఇప్పటికి కూడా నటించగలను అని మరొక సారి ప్రూవ్ చేశారు.మొత్తానికి అయితే కమల్ హాసన్ తన మాయమాటలతో తనను నమ్మించి మోసం చేశారని చెప్పింది.ప్రస్తుతం కమలహాసన్ నుంచి విడిపోయి ఒంటరిగా బతుకుతున్నాను అని చెప్తూ అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదు అని తనలోని బాధను బయటికి చెబుతున్నారు.

మనం ఎవరినైతే మనవాళ్ళు అని అనుకుంటామో వాళ్లే మనల్ని నమ్మించి మోసం చేస్తారని ఆవిడ చెబుతుంది.ఒకప్పుడు మంచి నటిగా గుర్తింపు పొందిన గౌతమి గారు అన్నీ కోల్పోయి ఇలా ఒంటరిగా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి…

.

#GauthamiKamal #Gauthami

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు