నటి గౌతమి జీవితంలో ఇన్నీ కష్టాలా.. అందం, పలుకుబడి ఉన్న దారుణమైన జీవితం?

ఒకప్పటి తెలుగు, తమిళ నటి గౌతమి పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే.తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమి.

 Tollywood Actress Gautamis Life Is So Hard, Tollywood, Actress, Gautami, Life Pr-TeluguStop.com

తన అందంతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈమె దయామయుడు అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

అంతే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించి స్టార్ హోదాను సంపాదించుకుంది.వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు షో లలో చేసింది.

ఈమె కొన్ని కష్టాల్లో దారుణమైన జీవితాన్ని ఎదుర్కొంది.

సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు ఎప్పుడు ఒకేలా ఉంటారు అనుకోవడం పొరపాటే అని చెప్పాలి.

ఎందుకంటే ఒక్కోసారి వాళ్ల జీవితాలు ఎటు అర్థంకాని పరిస్థితిగా మారుతాయి.ఇప్పటికే చాలామంది నటీనటులు ఆర్థికపరంగా, వ్యక్తిగతపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇందులో గౌతమి కూడా వ్యక్తిగతంగా దారుణమైన జీవితాన్ని గడిపింది.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ గ్రామంలో జన్మించింది గౌతమి.

ఇక టి.ఆర్.శేషగిరిరావు, డాక్టర్ వసుంధరాదేవి ఈమె తల్లిదండ్రులు.ఈమె చదువుకుంటున్న సమయంలోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఇక రాజేంద్ర ప్రసాద్ నటించిన గాంధీ నగర్ రెండో వీధి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.అదే సమయంలో కన్నడ, తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది.

ఇక శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.తమిళంలో గురుశిష్యన్ అనే సినిమాతో అడుగు పెట్టింది.

అలా తెలుగులో పలు సినిమాలలో నటించగా జెంటిల్మెన్ సినిమాలో చికుబుకు రైలు అనే పాటకు మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Telugu Actress, Gautami, Problems, Tollywood-Movie

ఇక 1998లో సందీప్ భాటియాను వివాహం చేసుకోగా ఆ తర్వాత ఏడాదికే అతడి నుండి విడాకులు తీసుకుంది.వారికి ఒక కూతురు కూడా ఉంది.అతనితో విడాకులు తీసుకున్న తర్వాత కమల్ హాసన్ తో సహజీవనం చేసింది.

వారి మధ్య కూడా బ్రేకప్ జరిగింది.నటిగానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా బాధ్యతలు చేపట్టింది.

ఆరోగ్యపరంగా క్యాన్సర్ తో బాధపడి వ్యాధిని ఎదుర్కొంది.అంతేకాకుండా క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్లకి ఓ ఫౌండేషన్ ను స్థాపించింది.ఇక తను గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా క్యాన్సర్ నుండి పోరాడిన విషయాలను పంచుకుంది.క్యాన్సర్ వ్యాధి తో పోరాడుతున్న వాళ్ళకి భయం అనేది ఉంటుందని.

దానివల్ల ఓడిపోయే పరిస్థితి కూడా వస్తుందని తెలిపింది.క్యాన్సర్ కు భయపడవద్దని, అలా అని తేలికగా తీసుకోకూడదని తెలిపింది.

Telugu Actress, Gautami, Problems, Tollywood-Movie

కాన్సర్ ను ఎదుర్కోవడానికి మానసిక ధైర్యం ఉండాలని.చాలా వరకు 50 శాతం మెడిసిన్స్ తో పనిచేస్తే మిగతా 50 శాతం మానసిక ధైర్యం తో వ్యాధిని ఎదుర్కోవచ్చని తెలిపింది.తను ఈ వ్యాధికి గురైనప్పుడు దారుణమైన పరిస్థితులను చూసిందట.చికిత్స జరిగేటప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా ఉంటాయని ఆ సమయంలో చాలా భయపడ్డాను అని తెలిపింది.

ఇక అప్పుడు తన వయసు 35 ఏళ్లు అని ఆ కష్టాలను మాటల్లో చెప్పలేను అంటూ వివరించింది గౌతమి.తనకు ఆ వ్యాధి వచ్చినప్పుడు ఎక్కువగా మానసికంగా ధైర్యం తెచ్చుకొని పోరాడి గెలిచానని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube