యాక్టింగ్ కు గుడ్ బై చెప్పిన హీరోయిన్ అనిత.. కారణం ఏంటంటే?

ఒకప్పటి తెలుగు సినీ నటి అనిత పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమున్న నటి.నువ్వు నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనిత ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.

 Tollywood Actress Anitha Says Good Bye To Acting-TeluguStop.com

ఇక 2013లో ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ రెడ్డి ని పెళ్లి చేసుకొని టాలీవుడ్ కు గుడ్ బై చెప్పింది.

తన పెళ్లి తర్వాత మొత్తం బాలీవుడ్ వైపు అడుగులు పెట్టి అక్కడే సెటిల్ అయ్యింది.

 Tollywood Actress Anitha Says Good Bye To Acting-యాక్టింగ్ కు గుడ్ బై చెప్పిన హీరోయిన్ అనిత.. కారణం ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ సినిమాలలో వరుసగా నటించి మంచి సక్సెస్ అందుకుంది.బుల్లితెర లో కూడా పలు సీరియల్స్ లలో నటించింది.

ఇటీవలే అనిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఈ బ్యూటీ తన ఫ్యామిలీ ఫోటో లను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక ఈ బ్యూటీ మొత్తానికే యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేసింది.

తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిత సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

Telugu Actress Anitha, Anitha Cine Career, Anitha Husband, Bollywood, Corona Crisis, Nuvvu Nenu Film, Nuvvu Nenu Heroine, Rohith Raddy, Serial Actress, Tollywood-Movie

సినిమాలకు, బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉండాలని డిసైడ్ అయిందట.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉన్నా లేకున్నా తను ఇదే నిర్ణయం తీసుకునే దాని అని తెలిపింది.తల్లిగా తన బిడ్డ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని అనుకోవడం తో ఈ నిర్ణయం తీసుకుందట.ఇక ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ ప్రభావం తో తనూ ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదట.

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఒకరిని అనుమతిస్తున్నానని తెలిపింది.కరోనా వైరస్ ప్రస్తుతం ముంబైలో ప్రమాదకరంగా ఉండటంతో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది.

#Rohith Raddy #Nuvvu Nenu Film #Actress Anitha #Corona Crisis #Anitha Husband

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు