నటీనటులుగానే కాదు డబ్బింగ్ ఆర్టిస్టులుగా ఎంతో పేరు సంపాదించుకున్న సెలెబ్రిటీలు

ఏ సినిమా ఇండస్ట్రీలో ఆ భాష నటులే పనిచేస్తే.డబ్బింగ్‍కు పెద్ద ఇబ్బంది ఉండదు.

 Tollywood Actors Works As A Dubbing Artists, Savitha Reddy, Roja Ramani, Chinmay-TeluguStop.com

కానీ నార్త్ నుంచి దిగుమతి అవుతున్న నటులకు తెలుగు ముక్క కూడా రాదు.వారికి కచ్చితంగా డబ్బింగ్ చెప్పాల్సిందే.

అలా తమ గొంతును అరువిచ్చిన డబ్బింగ్‍ ఆర్టిస్టులు.కొన్ని సినిమాలతోనే ఫేమస్‍ అయ్యారు.

తమ వాయిస్‍తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు.ఇంతకీ ఆ డబ్బింగ్‍ ఆర్టిస్టులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సరిత:

Telugu Chinmay, Hemachandra, Ravishanker, Roja Ramani, Sai Kumar, Saritha, Savit

విశ్వనటుడు కమలహాసన్‍తో మరో చరిత్ర సినిమాలో హీరోయిన్‍గా చేసిన సరిత.ఆ తర్వాత వెండి తెరకు దూరం అయ్యింది.డబ్బింగ్ ఆర్టిస్టుగా స్థిరపడింది.సౌందర్య, విజయశాంతి, నగ్మ లాంటి టాప్‍ హీరోయిన్లకు గొంతు అరువుగా ఇచ్చింది.

ఎస్పీ బాలు:

Telugu Chinmay, Hemachandra, Ravishanker, Roja Ramani, Sai Kumar, Saritha, Savit

కమల హాసన్ సహా పలువురికి డబ్బింగ్ చెప్పాడు పాటల రారాజు బాల సుబ్రమణ్యం.దశావతారం సినిమాల్లో 10 పాత్రలకు గాను ఏడు పాత్రలకు ఆయనే డబ్బింగ్ చెప్పాడు.అన్నమయ్య సినిమాలో తాను చెప్పిన డబ్బింగ్‍కు బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నాడు.

మనో:

Telugu Chinmay, Hemachandra, Ravishanker, Roja Ramani, Sai Kumar, Saritha, Savit

సౌత్‍ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్‍ కు మనో ఎక్కువగా డబ్బింగ్ చెప్తాడు.రజనీ తన సినిమాకు మనో మాత్రమే డబ్బింగ్ చెప్పాలి అంటాడు.కమల్ హాసన్‍కు కూడా ఈయన డబ్బింగ్ చెప్పాడు.

ఎస్పీ శైలజ:

Telugu Chinmay, Hemachandra, Ravishanker, Roja Ramani, Sai Kumar, Saritha, Savit

ఎస్పీ బాల సుబ్రమణ్యం సోదరి శైలజ.పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది.టబు, సోనాలి బింద్రే, సంఘవి, శ్రీదేవి సహా పలువురికి డబ్బింగ్ చెప్పింది.

సాయి కుమార్:

Telugu Chinmay, Hemachandra, Ravishanker, Roja Ramani, Sai Kumar, Saritha, Savit

తన గంభీరమైన వాయిస్‍తో ఎందరో హీరోలకు గాత్రదానం చేశాడు.ప్రధానంగా రాజశేఖర్, సుమన్‍ నటించిన అనేక సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు.ఆ వాయిస్ ఆయా హీరోలతో పాటు సాయికుమార్‍కు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

రవి శంకర్‍:

Telugu Chinmay, Hemachandra, Ravishanker, Roja Ramani, Sai Kumar, Saritha, Savit

సాయి కుమార్‍ తమ్ముడే ఈ రవి శంకర్‍.ఈయన కూడా మంచి వాయిస్‍తో డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎదిగాడు.సుమారు 4 వేల సినిమాకు డబ్బింగ్ చెప్పాడు.నాజర్‍, ప్రకాష్‍ రాజ్, సోనూసూద్ సహా పలువురికి తన గొంతుదానం చేశాడు.పలు అవార్డులు అందుకున్నాడు.

సునీత:

Telugu Chinmay, Hemachandra, Ravishanker, Roja Ramani, Sai Kumar, Saritha, Savit

టాలీవుడ్‍ సింగర్‍ సునీత కూడా పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది.త్రిష, కమలిని ముఖర్జీ, సదా, మీరా జాస్మిన్ సహా పలువురు నటీమణులకు వాయిస్‍ ఇచ్చింది.9 నంది అవార్డులు దక్కించుకుంది.

హేమచంద్ర:

Telugu Chinmay, Hemachandra, Ravishanker, Roja Ramani, Sai Kumar, Saritha, Savit

సింగర్ హేమచంద్ర కూడా డబ్బింగ్ చెప్పాడు. అరవింద్ స్వామికి ఈయనే వాయిస్‍ ఇచ్చాడు.తమిళ యంగ్‍ స్టార్‍ సినిమాలు తెలుగులోకి వస్తే ఈయనే డబ్బింగ్ చెప్తున్నాడు.

చిన్మయి:

Telugu Chinmay, Hemachandra, Ravishanker, Roja Ramani, Sai Kumar, Saritha, Savit

సమంతాకు డబ్బింగ్ చెప్పేది చిన్మయి మాత్రమే.ఈమె వాయిస్‍ మూలంగా సమంతాకు సైతం ఎంతో పేరొచ్చింది.ఏమాయ చేసావె సినిమాలో చిన్మయి గాత్రం మూలంగానే సమంతకు మంచి పేరు వచ్చింది.

రోజా రమణి:

Telugu Chinmay, Hemachandra, Ravishanker, Roja Ramani, Sai Kumar, Saritha, Savit

చైల్డ్ ఆర్టిస్టుగా మొదలైన ఈమె ప్రయాణం నటిగా కొనసాగి.డబ్బింగ్ ఆర్టిస్టుగా స్థిరపడింది.నాటి మేటి హీరోయిన్లు రాధ, రాధిక, సుహాసిని, భానుప్రియ సహా యమున, రోజా, రంభకు గాత్రదానం చేసింది.నటుడు తరుణ్ ఈమె కొడుకే.

సవిత రెడ్డి:

Telugu Chinmay, Hemachandra, Ravishanker, Roja Ramani, Sai Kumar, Saritha, Savit

ఈమె కూడా పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది.త్రిష, జెనీలియా, ఆర్తి అగర్వాల్, భూమిక సహా పలువురికి వాయిస్ ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube