అదృష్టం కోసం పేరును సవరించుకున్న నటీనటులు వీళ్ళే..!!

గ్లామర్ ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, టాలెంట్ ఒక్కదానితోనే సరిపోదని, జాతకాలు అదృష్టం కూడా కలిసిరావాలని అంటుంటారు.అలా కొంతమంది బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సెలబ్రిటీస్.

 Tollywood Actors Who Change Their Name For Numerology , Omkhar, Tamannaah, Hrit-TeluguStop.com

వాళ్ళ పేరుని కూడా మార్చుకొని సూపర్ స్టార్లు అయ్యారు.ఆలా సెలబ్రిటీస్ అయినా వారిలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.

లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు.అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టార్స్ వారి పూర్తి పేరుని మార్చుకున్నారు.

బట్ కొంతమంది సెలబ్రిటీలు వారి పేరులోనే కొంచం మార్పులు చేర్పులు చేసుకొని సెలబ్రిటీలుగా ఎదిగారు.న్యూమరాలజీ ప్రకారం మీ పేరులో ఏ అక్షరం తీసేస్తే లేదా చేరిస్తే బావుంటుందో జ్యోతిష్యులు, న్యూమరాలజీ స్పెషలిస్ట్ లు చెప్తుంటారు.అయితే అలా న్యూమరాలజీ ప్రకారం వారి పేరులో మార్పులు చేసుకున్న సెలబ్రిటిలు ఎవరో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Omkar To Ohmkar

తెలుగు యాంకర్స్ లో బడా యాంకర్ అయిన ఓంకార్ కూడా తన పేరుని మార్పించుకున్నాడు.తన ఓంకార్(omkar) అనే పేరులో O పక్కన H చేర్పించుకున్నాడు.ఇప్పుడు Ohmkar అయింది.

Tammana To Tamannaah

ఈ లిస్ట్ లో మొదటి పేరు మిల్కీ బ్యూటీ తమన్నా అని చెప్పాలి.ఈమె అసలు పేరు తమ్మన(Tammana).

అయితే సినిమాల్లోకి వచ్చేముందు తన పేరుని తమన్నా(tamannaah) గా మార్చుకుంది.ఆ తర్వాతే ఆమెకి అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చాయని ఒక సందర్భంలో చెప్పింది.

Telugu Hrithik Roshan, Karisma Kapoor, Omkhar, Rani Mukerji, Tamannaah-Telugu St

Rithik Roshan To Hrithik Roshan

ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ కూడా తన పేరుని మార్పించుకున్నాడు.ఇతని ఆలు పేరు రితిక్ రోషన్ అయితే సినిమాల్లోకి వచ్చేముందు పేరుని మార్పించామని జ్యోతిష్యులు చెప్పడంతో తన పేరుని హృతిక్ రోషన్ గా మార్చుకున్నాడు.

Rani Mukherjee To Rani Mukerji బాలీవుడ్ బ్యూటీ రాణి ముఖర్జీ(Rani Mukherjee) కూడా తన పేరులో లాస్ట్ లో ఉన్న ee తీసేసి i అని పెట్టుకుంది.దానితో Rani Mukerji అయింది.అలా పేరు మార్చక ఆమె జాతకమే మారిపోయింది.

Rajkumar Rao To Rajkummar Rao

Telugu Hrithik Roshan, Karisma Kapoor, Omkhar, Rani Mukerji, Tamannaah-Telugu St

ఇక ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న హీరో రాజ్ కుమార్ రావు కూడా తన పేరులోని కుమార్ లో ఇంకొక M చేర్చాడు.అంటే kumar ని కాస్త kummar చేసాడు.

Telugu Hrithik Roshan, Karisma Kapoor, Omkhar, Rani Mukerji, Tamannaah-Telugu St

Karishma Kapoor To Karisma Kapoor

బాలీవుడ్ అందగత్తెలు, అక్కాచెల్లెళ్లు అయినా కరీనా కపూర్ అండ్ కరిష్మా కపూర్ లు ఇద్దరు వారి పేర్లలో మార్పులు చేయించుకున్నారు.ముందు అక్క కరిష్మా కపూర్ తన పేరుని చేంజ్ చేయించుకుంది.ఈమె karishma kapoor లో H తీసేసి karisma kapoor అయింది.

ఇక కరీనా కపూర్ వచ్చేసి Kareina Kapoor లో I తీసేసి E పెట్టించుకుంది.దాంతో Kareena Kapoor అయింది.

Telugu Hrithik Roshan, Karisma Kapoor, Omkhar, Rani Mukerji, Tamannaah-Telugu St

Ayushman Khurana To Ayushmann Khurrana

టెలివిజన్ హోస్ట్ గా కెరియర్ ప్రారంభించి ఒక మంచి సింగర్ గా, ఇప్పుడు బాలీవుడ్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయుష్మాన్ కురాని కూడా తన పేరులో ఎక్సట్రా N ని యాడ్ చేయించికున్నాడు.మే బి అది చేయించుకున్నాకే అతనికి బాగా కలిసొచ్చిందేమో…

Ajay Devgan To Ajay Devgn

ఇక బాలీవుడ్ కండల వీరుడు అజయ్ దేవగన్ కూడా తన పేరుని మార్పించుకున్నారు.ఈయన Ajay Devgan లో A తీసేసి Ajay Devgn అయ్యాడు.

Telugu Hrithik Roshan, Karisma Kapoor, Omkhar, Rani Mukerji, Tamannaah-Telugu St

Sonam A Kapoor To Sonam Kapoor

బాలీవుడ్ లో తన ఒంపుసొంపులతో, అందచందాలతో అదరగొడుతున్న సోనమ్ కపూర్ కూడా పేరు మార్చుకుంది.ఈమే Sonam A Kapoor లో A తీసేసి జస్ట్ Sonam Kapoor అని పెట్టేసుకుంది.

Vivek Oberoi To Viveik Oberoi

చరిత్ర సినిమాలో పరిటాల రవి పాత్రలో మనల్ని అందరిని అలరించిన హీరో వివేక్ ఒబెరాయ్ కూడా తన పేరుని మార్చుకున్నాడు.ఇతను vivek లో i యాడ్ చేసి viveik గా మార్చుకున్నాడు.

అయితే వీళ్ళు పేరు మార్చుకోవడం వలెనే సక్సెస్ అయ్యారంటే ఏమో చెప్పలేం అదంతా వాళ్ళ అదృష్టం అలాగే డెస్టినీ అని అనుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube