ఈ నటుల ప్రతిభ ముందు విధిరాత ఓడిపోయింది....అంగవైకల్యం మిగిలింది

మనలో ప్రతిభ, దానికి తోడుగా అదృష్టం ఉంటే ఏదైనా సాధించగలం.అవకాశాలు తమంతట తామే వెతుక్కుంటూ వస్తాయి.

 Tollywood Actors Who Are Limited To Wheel Chair, Tollywood Handicapped Actors, L-TeluguStop.com

సినిమా పరిశ్రమలోనూ ఈ రెండు ఉంటేనే సక్సెస్ అవుతారు.నటనలో దమ్ముంటే చాలు పాత్రలు వచ్చి వాలుతాయి.

కొంత మంది నటులు ప్రమాదానికి గురై.వీల్ చైర్ కు పరిమితం అయినా.

సినిమా ఛాన్సులు మాత్రం ఆగలేదు.ఇంతకీ ఆ నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

నూతన్ ప్రసాద్

బాపు దర్శకత్వంలో తెరకెక్కిన అందాల రాముడు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నూతన్ ప్రసాద్.ఎన్నో సినిమాల్లో విలన్ గా చేశాడు.పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కొనసాగాడు.ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేస్తున్న బామ్మ మాట బంగారు బాట అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ లో కారు పైనుంచి కింద పడే సీన్ తీస్తున్నారు.

కారుకు తాడు కట్టి పైకి లేపుతారు.అనుకోకుండా తాళ్లు తెగి కారు కిందపడుతుంది.

ఈ ప్రమాదం నుంచి రాజేంద్ర ప్రసాద్ తప్పించుకున్నాడు.కారులోనే ఉన్న నూతన ప్రసాద్ కి మాత్రం తీవ్రంగా దెబ్బలు తగిలాయి.

కాళ్లు పనిచేయకుండా పోయాయి. జీవితాంతం వీల్ చైర్ కే పరిమితం అయ్యాడు.

పలువురు సినిమా రచయితలు సైతం నూతన్ ప్రసాద్ ను దృష్టిలో ఉంచుకుని కథులు రాశారు.ఆయన వీల్ చైర్ లో ఉంటూనే నటించి మంచి పేరు పొందాడు.

విద్యాసాగర్

Telugu Aashiqui, Anu Aggarwal, Car, Wheel Chair, Nootan Prasad, Vidya Sagar-Telu

ఈ చదువులు మాకొద్దు చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విద్యాసాగర్.అనంతరం కామెడీ సినిమాల దర్శకుడు జంధ్యాల తీసిన చాలా సినిమాల్లో నటించాడు.అయితే అతడికి పక్షవాతం రావడంతో ఒక కాలు, ఒకచేయి పనిచేయకుండా పోయాయి.తను కూడా వీల్ చైర్ కు పరిమితం అయ్యాడు.అయినా ఆయన పలు సినిమాల్లో నటించి మంచి పేరు పొందాడు.

అను అగర్వాల్

Telugu Aashiqui, Anu Aggarwal, Car, Wheel Chair, Nootan Prasad, Vidya Sagar-Telu

మంచి గ్లామర్ తో అలరించిన నటి అను అగర్వాల్.ఆషికి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకి మంచి క్రేజ్ వచ్చింది.ఓ కారు ప్రమాదంలో ఆమె 20 రోజుల పాటు కోమాలోకి వెళ్లింది.

బతకదు అనుకున్న సమయంలో డాక్టర్లు చాలా కష్టపడి బతికించారు.అను అగర్వాల్ తన అందాన్ని కోల్పోవడంతో ఆమెకు సినిమాల్లో ఛాన్స్ లు తగ్గిపోయాయి.

ప్రస్తుతం బీహీర్ లోని ఓ యోగా కేంద్రంలో యోగా నేర్చుకని పవర్ లిప్టర్ గా పనిచేస్తుంది.ఏదైనా అవకాశం వస్తే సినిమాలు చేయాలని భావిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube