బెడిసికొట్టిన 96 ప్రయోగం... ప్రమాదంలో యంగ్ హీరో కెరియర్...  

Tollywood Actor Sharwanand Career In Problem-tollywood Actor Sharwanand,tollywood Hero Sharwanand

తెలుగులో విభిన్న కథనాలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ సరికొత్తగా ప్రేక్షకులను అలరించే శర్వానంద్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే తాజాగా శర్వానంద్ “జాను” అనే చిత్రంలో నటించాడు.

Tollywood Actor Sharwanand Career In Problem-Tollywood Hero

ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడీగా సమంత నటించింది.ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించినటువంటి 96 దానికి రీమేక్ గా ఉంది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.

అయితే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 7వ తారీఖున విడుదలయింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంచనాల దగ్గట్టుగా రాణించలేక పోతోంది. అయితే టాక్ పరంగా మంచి పేరు తెచ్చుకున్న జాను వసూళ్లు మాత్రం సాధించలేక పోతుంది.

దీంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు.

దీంతో ప్రస్తుతం శర్వానంద్ కెరీర్ ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.గతంలో శర్వానంద్ నటించిన టువంటి పడి పడి లేచే మనసు, రణరంగం చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి.దీంతో శర్వానంద్ కొంతమేర గడ్డుకాలం ఎదుర్కుంటున్నాడు.ఇలాంటి పరిస్థుతులను దృష్టిలో ఉంచుకుని ఇంక ప్రయోగాలకు స్వస్తి చెప్పి కథల ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు