రాజమౌళికి చుక్కలు చూపించిన తారక్.. ఏం జరిగిందంటే..?

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,దర్శకధీరుడు రాజమౌళి మధ్య ఉన్న అనుబంధం గురించి మనందరికీ తెలిసిందే.అటు హీరోగా ఎన్టీఆర్ కు, ఇటు దర్శకుడిగా రాజమౌళికి స్టూడెంట్ నంబర్ 1 సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి పేరు, గుర్తింపు వచ్చింది.

 Tollywood Actor Manoj Nandam Shares About Rajamouli And Ntr Funnything,chatrapat-TeluguStop.com

స్టూడెంట్ నంబర్ 1 హీరోగా తారక్ కు రెండో సినిమా కాగా దర్శకుడిగా రాజమౌళికి తొలి సినిమా.ఛత్రపతిలో ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించిన మనోజ్ నందం అనే నటుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఛత్రపతి సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చేసిన అల్లరి గురించి చెప్పారు.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమా షూటింగ్ హైదరాబాద్ లో బంగ్లాలో జరుగుతోందని.భారీ షెడ్యూల్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అక్కడకు వచ్చాడని.వచ్చిన తరువాత రాజమౌళిని అక్కడినుంచి లాక్కెళ్లిపోయాడని చెప్పారు.రాజమౌళి షూటింగ్ ఉందని ఇప్పుడు వీలు కుదరదని చెప్పాడని.

ఎన్టీఆర్ మాత్రం లొకేషన్ మధ్యలో కూర్చుని గోల చేశాడని అన్నారు.

దీంతో రాజమౌళి తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ కు ప్యాకప్ చెప్పి తారక్ తో వెళ్లిపోయాడని.

ఒక సినిమా చూసిన తారక్ ఆ సినిమా నచ్చడంతో ఆ సినిమాను మళ్లీ రాజమౌళితో చూడాలని రాజమౌళికి చుక్కలు చూపించి మరీ ఎన్టీఆర్ తీసుకెళ్లినట్టు చెప్పారు.గతంలో కొందరు దర్శకులు ఎన్టీఆర్ సెట్స్ లో బాగా అల్లరి చేస్తాడని చెప్పిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించిన ఆర్ఆర్ఆర్ యూనిట్ కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో షూటింగ్ పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ప్రకటించాలని భావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube