టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న టాప్ కామెడియన్ కూతురు...  

Tollywood Actor Ali Daughter Debut To The Movie Industry - Telugu Ali Daughter Debut To The Movie Industry, Ali Daughter Javeriya News, Tollywood Comedian Ali, Tollywood Comedian Ali Daughter News, Tollywood Comedian Ali News

టాలీవుడ్ లో ఎన్నో వందలకుపైగా కామెడీ పాత్రలు పోషించిన ప్రముఖ కమెడియన్ మరియు హీరో ఆలీ గురించి సినిమా పరిశ్రమలో పెద్దగా తెలియని వారుండరు.అయితే ఆలీ హీరోగా కూడా దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో నటించాడు.

 Tollywood Actor Ali Daughter Debut To The Movie Industry

ఇందులో సర్కస్ సత్తిపండు, గుండమ్మగారి మనవడు, హంగామా వంటి చిత్రాలు అలికి మంచి పేరు సంపాదించాయి.అయితే అలీ ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలు రకాల షోలు, ఈవెంట్లు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

అయితే తాజాగా అలీ పెద్ద కూతురు అయినటువంటి జవెరియా ని టాలీవుడ్ సినీ పరిశ్రమకు బాలనటిగా పరిచయం చేసేందుకు అలీ సన్నాహాలు చేస్తున్నాడు.ఇందులో భాగంగా అలీ ప్రస్తుతం నటిస్తున్న “మా గంగా నది” అనే చిత్రంలో జవేరియా నటిస్తున్నట్లు సమాచారం.

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న టాప్ కామెడియన్ కూతురు…-Latest News-Telugu Tollywood Photo Image

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వి.బాల నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే తన జవేరియా తండ్రి అలీ కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు.మరి జవేరియా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఆలీ మాజీ భారత రాష్ట్రపతి మరియు సైన్స్ లెజెండ్ అబ్దుల్ కలాం జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్నటువంటి బయోపిక్ లో కూడా నటిస్తున్నాడు.అంతేకాక అలీ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో కూడా కమెడియన్ గా నటిస్తున్నాడు.అయితే బాల నటుడి గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయినటువంటి ఆలీ అప్పటి నుంచి ఇప్పటి వరకు  వంద లకు పైగా చిత్రాల్లో నటించి తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ali Daughter Javeriya News,tollywood Comedian Ali,tollywood Comedian Ali Daughter News,tollywood Comedian Ali News- Related....