అసలే కరోనా.. మరీ ఇంత పోటీ అవసరమా?

కరోనా భయంతో లాక్‌ డౌన్‌ కు ముందు నుండే ఇండియాలో థియేటర్లకు తాళం వేశారు.మార్చి నుండి మొన్నటి వరకు కనీసం తాళాలు కూడా తీయలేదు.

 Tollywood 4 Movies Releasing For Sankranti Festival ,  Lockdown, Lock For Theate-TeluguStop.com

ఎట్టకేలకు ఇటీవలే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల ఓపెన్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.పెద్ద ఎత్తున జనాలు థియేటర్లకు వస్తారని జనాలతో మళ్లీ థియేటర్లు కళకళలాడుతాయి అంటూ అంతా నమ్మకంగా అనుకున్నారు.

కాని ఇప్పటి వరకు థియేటర్లకు జనాలు క్యూ కడుతున్న దాఖలాలు లేవు.

Telugu Sankranti, Allari Naresh, Box, Christmas, Corona, Crack, Lock Theaters, L

సరే కొత్త సినిమాలు లేకపోవడం వల్ల రావడం లేదులే అనుకోవచ్చు.అందుకే ఈ క్రిస్మస్ కు థియేటర్లకు కొత్త సినిమాలు వస్తున్నాయి.ఆ తర్వాత టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ముఖ్యంగా సంక్రాంతిని నాలుగు సినిమాలు రాబోతున్నాయి.

Telugu Sankranti, Allari Naresh, Box, Christmas, Corona, Crack, Lock Theaters, L

టాలీవుడ్ లో సంక్రాంతి కానుకగా రవితేజ నటించిన క్రాక్‌, తమిళ హీరో విజయ్‌ నటించిన మాస్టర్‌, రామ్‌ నటించిన రెడ్‌ ఇంకా అల్లరి నరేష్‌ సినిమా కూడా విడుదలకు సిద్దం అవుతుంది.ఈ నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ ను దడదడలాడిస్తాం అంటూ వచ్చేస్తున్నాయి.అసలే కరోనా సమయం, జనాలు వస్తారో రారో తెలియదు.

Telugu Sankranti, Allari Naresh, Box, Christmas, Corona, Crack, Lock Theaters, L

థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ కనుక ఒకదాని తర్వాత ఒకటి వస్తే అన్ని సినిమాలకు న్యాయం జరుగుతుంది.కాస్త ఫలితం తేడా కొట్టినా కూడా ఆ సినిమా పని ఖతం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో ఒకే సారి నాలుగు సినిమాలు విడుదల అవ్వడం వల్ల ఏ ఒక్క సినిమాకు కూడా పూర్తి స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యే అవకాశం లేదు.దానికి తోడు అన్ని సినిమాలు కూడా కలెక్షన్స్‌ విషయంలో నిరాశ పడాల్సి రావచ్చు అంటున్నారు.

మరి ఈ సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుంది అనేది చూడాలి.

Telugu Sankranti, Allari Naresh, Box, Christmas, Corona, Crack, Lock Theaters, L .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube