సైలెంట్‌గా 'బంగార్రాజు'ను మొదలెట్టేశారు  

Bangarraju Movie Movie Is Stated-akkineni Nagachaitanya,akkineni Nagarjuna,bangarraju Movie,ramyakrishna,soggade Chinni Nayana

నాగార్జున ‘మన్మధుడు 2’ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.ఆ చిత్రం ఫలితంతో నాగార్జున సినిమాల ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.నాగ్‌ తర్వాత సినిమా ఏమై ఉంటుంది, ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటూ చర్చలు జరుగుతున్న సమయంలో ‘బంగార్రాజు’ గురించిన పనులు మొదలైనట్లుగా అన్నపూర్ణ స్టూడియో వర్గాల నుండి అనధికారిక సమాచారం అందుతోంది.షూటింగ్‌కు కాస్త సమయం ఉంది కాని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మాత్రం జరుగుతున్నాయని తెలుస్తోంది.

Bangarraju Movie Movie Is Stated-akkineni Nagachaitanya,akkineni Nagarjuna,bangarraju Movie,ramyakrishna,soggade Chinni Nayana-Bangarraju Movie Is Stated-Akkineni Nagachaitanya Akkineni Nagarjuna Bangarraju Ramyakrishna Soggade Chinni Nayana

Bangarraju Movie Movie Is Stated-akkineni Nagachaitanya,akkineni Nagarjuna,bangarraju Movie,ramyakrishna,soggade Chinni Nayana-Bangarraju Movie Is Stated-Akkineni Nagachaitanya Akkineni Nagarjuna Bangarraju Ramyakrishna Soggade Chinni Nayana

దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేయడం జరిగింది.నాగార్జున స్క్రిప్ట్‌కు చిన్న చిన్న మాడిఫికేషన్స్‌ చెప్పి షూటింగ్‌కు ఓకే చెప్పాడు.అయితే ప్రస్తుతం బిగ్‌ బాస్‌ చేస్తున్న కారణంగా కాస్త సమయం తీసుకోవాలని భావిస్తున్నాడు.ఈ సమయంలోనే దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌కు సిద్దం అయ్యాడు.అనూప్‌రూబెన్స్‌తో బంగార్రాజు చిత్రానికి అప్పుడే ట్యూన్స్‌ చేయిస్తున్నాడు.సినిమాలో నాలుగు రొమాంటిక్‌ సాంగ్స్‌ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

నాగార్జున మరియు నాగచైతన్యల కాంబోలో రాబోతున్న చిత్రం అవ్వడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.ఒక వైపు మ్యూజిక్‌ సిట్టింగ్స్‌తో బిజీగా ఉన్నా మరో వైపు నటీనటుల ఎంపిక విషయంలోనూ చర్చలు జరుపుతున్నారు.

దర్శకుడు ఇప్పటికే రమ్యకృష్ణతో చర్చలు జరిపి ఓకే చెప్పించాడు.ఇక ఈ చిత్రం కోసం మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి.ఈ చిత్రంను నవంబర్‌ లేదా డిసెంబర్‌లో పట్టాలెక్కించి వచ్చే ఏడాది సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు భావిస్తున్నాడు.