అమెరికా లో ప్రముఖ కమెడియన్ పై దాడి  

Attack On Tolly Wood Star Comedian In Tana Sabhalu-star Comedian,tana,tana Sabhalu,అమెరికా లో ప్రముఖ కమెడియన్ పై దాడి

విషయం ఏమి జరిగిందో తెలియదు కానీ టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ పై అమెరికా లో దాడి జరిగినట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా అమెరికా తెలుగు సంఘం(తానా)22 వ మహా సభలు వాషింగ్టన్ డీసీ లో జరిగిన సంగతి తెలిసిందే. జులై 4 నుంచి జులై 6 వరకు కూడా ఈ సభలు చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ సభల కోసం టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్లు కూడా హాజరై సందడి చేశారు. అయితే తమ ఆట పాటలతో సందడి చేసి తానా ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు..

అమెరికా లో ప్రముఖ కమెడియన్ పై దాడి-Attack On Tolly Wood Star Comedian In TANA Sabhalu

కానీ ఇప్పుడు ఈ ఈవెంట్ గురించి కంటే స్టార్ కమెడియన్ పై దాడి ఘటన గురించే అందరూ చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే…. తానా సభలు ముగిసిన తరువాత సదరు కమెడియన్ కు నిర్వాహకులు సన్మానం నిర్వహించారు. అనంతరం మరో తెలుగు సంస్థ కూడా సన్మాన కార్యక్రమం కోసం అని తీసుకెళ్లి సన్మానం చేసిన అనంతరం ఒక చిన్న పార్టీ కూడా ఏర్పాటు చేశారు.

అయితే ఈ పార్టీ లో బాబు గారు కాస్త తాగి ఆ మద్యం మత్తులో ఒక మహిళ పై అసభ్యంగా ప్రవర్తించాడని,దానితో సదరు మహిళ తరపు బంధువులు ఈయన గారికి దేహ శుద్ధి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అసలు విషయం బయటకు రావడం లేదు కానీ స్టార్ కమెడియన్ పై మాత్రం దాడి జరిగినట్లు ఇప్పుడు వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయినా ఏదైనా సన్మానం జరిగితే లేదా అవార్డు ఇస్తే ప్రచారం చేసుకుంటారు కానీ, ఎంతైనా ఆయన స్టార్ కమెడియన్ కాబట్టి ఇలాంటి విషయాలు బయటకు రావు అన్న విషయం అర్ధం అవుతుంది.