బిరుదులను మార్చుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోలను అభిమానులు ఆయా హీరోల పేర్లతో కంటే బిరుదులతోనే ఎక్కువగా పిలుచుకుంటున్నారు.హీరోల ఫ్యాన్స్ ఈ బిరుదులను ఎంతగానో ఇష్టపడతారు.అయితే హీరోలు మొదట ఉన్న బిరుదులను వేర్వేరు కారణాల వల్ల తరువాత కాలంలో మార్చుకున్నారు.20 ఏళ్ల వయస్సులోనే ఆది, సింహాద్రి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ను అభిమానులు ప్రేమగా యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు.

 Tollwood Star Heroes Screen Name Change Details Here-TeluguStop.com

మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన శక్తి సినిమాకు ఎన్టీఆర్ తన బిరుదును ఏ1 స్టార్ అని మార్చుకోగా ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో పాటు ఏ1 స్టార్ అనే బిరుదుపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.అయితే ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ బిరుదు యంగ్ టైగర్ గానే కొనసాగుతోంది.

బాలనటుడిగానే పదుల సంఖ్యలో సినిమాల్లో నటించిన మహేష్ ప్రిన్స్ అనే బిరుదుతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు.

 Tollwood Star Heroes Screen Name Change Details Here-బిరుదులను మార్చుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Icon Star, Screen Name Change, Tollywood Star Heroes, Young Tiger Ntr-Movie

దూకుడు సినిమా నుంచి ప్రిన్స్ అనే బిరుదును మహేష్ సూపర్ స్టార్ గా మార్చుకున్నారు.ప్రస్తుతం మహేష్ బాబుకు సినిమాల్లో బిరుదు సూపర్ స్టార్ గానే కొనసాగుతుండటం గమనార్హం.సీనియర్ స్టార్ హీరో నాగార్జునను ఆయన అభిమానులు ప్రేమగా యువసామ్రాట్ అని పిలుచుకునేవారు.శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్ సినిమా నుంచి నాగార్జున పేరు ముందు కింగ్ టైటిల్ చేరింది.

ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా నటించే బాలకృష్ణను అభిమానులు యువరత్న అని పిలుచుకునేవారు.అయితే సింహా సినిమా నుంచి బాలకృష్ణ తన పేరును నటసింహంగా మార్చుకున్నారు.

చిరంజీవి బిరుదు మొదట సుప్రీమ్ హీరో కాగా తరువాత కాలంలో చిరు మెగాస్టార్ గా తన బిరుదును మార్చుకున్నారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన బిరుదును ఐకాన్ స్టార్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే.

#Young Tiger NTR #TollywoodStar #Icon Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు