సాయి పల్లవిని బూతులు తిట్టిన ఫ్యాన్స్‌... అసలు కారణం ఇదే  

tolls on sai pallavi about ngk movie launch function -

ప్రస్తుతం సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌ అంటే ఠక్కున వినిపించే పేర్లలో సాయి పల్లవి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.తెలుగు, తమిళం మరియు మలయాళంలో ఈ అమ్మడు కుమ్మేస్తోంది.

TeluguStop.com - Tolls On Sai Pallavi About Ngk Movie Launch Function

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల సంఖ్య భారీగానే ఉంది.వచ్చిన ప్రతి అవకాశంకు ఓకే చెప్పకుండా అడపా దడపా ఓకే చెబుతూ ఈ అమ్మడు ముందుకు సాగుతోంది.

తాజాగా ఈమె నటించిన ‘ఎన్జీకే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సందర్బంగా ఈమె సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఎన్జీకే చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఈ అమ్మడు సోషల్‌ మీడియా లైవ్‌ చాట్‌కు వచ్చి అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది.తాను లైవ్‌ చాట్‌కు రాబోతున్నట్లుగా రెండు మూడు రోజుల నుండి పోస్ట్‌ చేస్తూ వచ్చింది.ఏమైనా ప్రశ్నలుంటే సిద్దం చేసుకోండి అంటూ ప్రకటించింది.తీరా ఆరోజు వచ్చేప్పటికి మొహం చాటేసింది.బిజీ షెడ్యూల్‌ కారణంగా లైవ్‌ చాట్‌కు రాలేక పోయింది.

***

సాయి పల్లవి ఆన్‌లైన్‌కు వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు నిరాశ మిగిలింది.

అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఆమెను ప్రశ్నలు అడిగేందుకు సిద్దం అయ్యారు.కాని ఆమె మాత్రం లేకపోవడంతో నిరుత్సాహం వ్యక్తం చేశారు.చివరకు ఆమెను ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం మొదలు పెట్టారు.అసలు టైం లేనప్పుడు ఎందుకు ఇలా వస్తానంటూ చెప్పడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టైం లైదనుకునే వారు మీరు ఎలా మమ్ములను చీట్‌ చేస్తారంటూ ఆగ్రహంతో ఎంతో మంది పోస్ట్‌ చేయడంతో ఆమె చివరకు సారి చెప్పి మళ్లీ ఎప్పుడైనా లైవ్‌ చాట్‌కు వస్తానంటూ హామీ ఇచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tolls On Sai Pallavi About Ngk Movie Launch Function Related Telugu News,Photos/Pics,Images..