మళ్ళి మొదలైన టోల్ బాదుడు.. పెరిగిన ఛార్జీలు..!

సామాన్యుడిపై మరోసారి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది.ఇక ఇప్పటికి నిత్యావసర వస్తువులపై చార్జీలు పెంచిన సంగతి అందరికి తెలిసిందే.

 Toll Duck Starts Again Increased Charges , Toll Plaza, Toll Plaza Charges, Rates-TeluguStop.com

పెట్రోల్ నుంచి ప్రతీ ఒక్కటి పెరుగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే సామాన్యుడిపై మరో గుదిబండ పడింది.

టోల్ చార్జీలు పెంచుతూ గుత్తేదారు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

జాతీయ రహదారిపై ఒక్క వాహనానికి రానుపోను.మొత్తంగా కలిపి కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.25 వరకు పెరిగింది.నెలవారి పాస్‌కు కనిష్టంగా రూ.90 నుంచి గరిష్టంగా రూ.590 వరకు పెరిగింది.లోకల్ పాస్‌కు రూ.10వరకు పెంచారు.హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-భూపాలపల్లి జాతీయ రహదారులను బిఒటి పద్దతిలో నిర్మించారు.ఇలా నిర్మించిన రహదారులపై ఏడాదికి ఓ సారి టోల్ ఛార్జ్ పెంచుతారు గుత్తేదారులు.పెరిగిన టోల్ ఛార్జ్ బుధవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది.

ఇక లోకల్ పాస్ కు కూడా పది రూపాయల దాకా పెంచారు.

బడ్జెట్ ఎఫెక్ట్ తో ఈరోజు నుండి ఆర్ధికరంగంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.పంతంగి టోల్ ప్లాజా వద్ద, కార్ వ్యాన్ జీప్ లకు ఒక వైపు 80, మినీ బస్ కి 130, ట్రక్ కి 265 దాకా రేట్లు నెలవారీ పెరిగినట్టు అయ్యాయి.

బడ్జెట్ ఎఫెక్ట్ తోటి ఆర్ధిక రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

అయితే ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదించడంతో యాదాద్రి జిల్లాలోని పంతంగి, గూడురు, నల్గొండ జిల్లాలోని కొర్లపహాడ్‌, ఏపీలోని జగ్గయ్యపేట చిల్లకల్లు వద్ద జాతీయ రహదారులపై కొత్త రేట్లు వసూలు చేస్తున్నారు.

రేట్ల వివరాలను ఒకసారి చూద్దమా.పంతంగి టోల్‌ప్లాజా వద్ద రేట్లను చుస్తే కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌కు ఒకవైపు రూ.80, ఇరువైపులా 120, లైట్‌ కమర్షియల్‌, గూడ్స్‌ వెహికల్‌, మినీ బస్సుకు ఒకవైపు రూ.130, రెండు వైపులా కలిపి రూ.190, బస్సు, ట్రక్కు ఒకవైపు రూ.265, ఇరువైపులా కలిపి రూ.395గా నిర్ణయించారు.

ఇక హైదరాబాద్‌-భూపాలపట్నం రోడ్డులో గూడురు టోల్‌ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌కు ఒకవైపు రూ.100, ఇరువైపులా కలిపి రూ.150, లైట్‌ కమర్షియల్‌, గూడ్స్‌ వెహికల్‌, మినీ బస్సుకు ఒకవైపు రూ.150, ఇరువైపులా కలిపి రూ.225, బస్సు, ట్రక్కు ఒకవైపు రూ.305, ఇరువైపులా కలిపి రూ.460గా నిర్ణయించారు.హెవీ ట్రక్కులకు భారీగా పెరిగింది.వాటిని 50 నుంచి 600 మధ్య పెంచినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube