నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు!  

Tolday Telangana Inter Result-

ఏడాది కాలంగా చదువులతో కుస్తీలు పది పరీక్షలు రాసిన విద్యార్ధుల భవిష్యత్తు తేలే సమయం వచ్చేసింది.ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది.అక్కడ బాలికలు తమ సత్తా చూపించి టాప్ లో నిలిచారు.అలాగే ఇంటర్ ఫలితాలు అక్కడ కొంత మంది విద్యార్ధుల ప్రాణాలు కూడా తీసాయి.

Tolday Telangana Inter Result-

ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా ఇంటర్ ఫలితాలు విడుదలకి రంగం సిద్ధం అయ్యింది.

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్నాయి.

విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.నాంపల్లిలో గల తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యూకేషన్, విద్యాభవన్‌లో అధికారులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

మరి ఈ ఫలితాలలో విద్యార్ధులు ఎ విధంగా తమ సత్తా చాటారు, ఎవరు పైచేయి సాధించారు అనే విషయాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది.

.

తాజా వార్తలు